![Election Commission Allotted Free Symbol Glass To Jana Sena](/styles/webp/s3/gallery_images/2024/02/27/03_0.jpg.webp?itok=UBkEWgYj)
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కాగా, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిషికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఉన్నాయి.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును ఈసీ ప్రకటించింది. ఇదే సమయంలో జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీగా గుర్తించకపోవడం విశేషం. దీంతో, జనసేనను కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించి.. ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గ్లాసు గుర్తును కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment