అబద్ధ్దాల్లో కేసీఆర్‌ను మించిన రేవంత్‌ | Sakshi
Sakshi News home page

అబద్ధ్దాల్లో కేసీఆర్‌ను మించిన రేవంత్‌

Published Thu, May 9 2024 12:15 AM

అబద్ధ్దాల్లో కేసీఆర్‌ను మించిన రేవంత్‌

● గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ● ఖానాపూర్‌లో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌

ఖానాపూర్‌: అబద్ధాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్ర స్తుత సీఎం రేవంత్‌రెడ్డి మించిపోయారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. బుధవా రం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడోషోలో పాల్గొని కార్నర్‌మీటింగ్‌లో మాట్లాడా రు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నట్లు ఆరోపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయో రేవంత్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని, దేశాభివృద్ధి, దేశ రక్షణకు మూడోసారి మోదీ ని ప్రధానిగా గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ గెలిచే సీట్లలో ఆదిలాబాద్‌ కూడా ఉంటుందని ధీమా వ్యక్తంజేశారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏ బూత్‌లో ఎక్కువ ఓట్లు వస్తే వారిని తానే స్వయంగా సన్మానిస్తానని చెప్పారు. ‘పాకిస్థాన్‌ దగ్గర ఆటంబాంబు’ అంటూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫారూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రతీ భారత పౌరుడు అనుబాంబుతో సమానమని హెచ్చరించారు. పాకిస్థాన్‌ గురించి గొప్పగా చెప్పే కాంగ్రెస్‌ నాయకులు ఈ దేశంలో ఉండడం అవసరమా? అని ప్రశ్నించారు. అనంతరం నాయకులు రాజాసింగ్‌ను సన్మానించారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రితీశ్‌ రాథోడ్‌, నాయకులు అంకం మహేందర్‌, ఆకుల శ్రీనివాస్‌, నాయిని సంతోష్‌, తోకల బుచ్చన్న, టేకు ప్రకాశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement