జోనల్ పోటీల్లో భైంసా బాలికల సత్తా..
భైంసాటౌన్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కంజరలో జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ స్థాయి పోటీల్లో భైంసా పట్టణంలోని బాలికల గురుకుల విద్యార్థినులు సత్తా చాటారు. జోనల్ స్థాయిలో 18 పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. 17 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయులు విద్యార్థినులు, పీఈటీని మంగళవారం అభినందించారు. అండర్ –14, 200మీ. పరుగుపందెం, లాంగ్‌జంప్‌లో ఎల్.ఆకాంక్ష మూడోస్థానం, షాట్‌పుట్‌లో ఎం.సంజన (మొదటి), బి.స్నేహిత(రెండోస్థానం), డిస్కస్‌త్రోలో జి.పూజ(రెండో స్థానం) సాధించగా, అండర్–17 చెస్ పోటీలో కె.అనుష్క(మొదటి), షాట్‌పు, 400 మీల పరుగులో కె.అనుశ్రీ(రెండు, మూడు), డిస్కస్‌త్రోలో జయశ్రీ మొదటి బహుమతి పొందారు. అండర్–19, 800 మీ.ల పరుగులో కె.హర్షిత రెండోస్థానంలో నిలిచింది.
రాష్ట్రస్థాయికి ఎంపికై న వారు..
అండర్–14 కబడ్డీలో స్నేహిత, ఖోఖోలో ఎస్.శ్రీనిధి, సీహెచ్.సంధ్య, ఎల్.ఆకాంక్ష, అండర్– 17 ఖోఖోలో బి.శరణ్య, అండర్ –19లో జే.ప్రకృతి, అండర్–17 వాలీబాల్‌లో జె.సునయన, అండర్–19లో బి.తేజ, అథ్లెటిక్స్‌లో కె.అనుష్క, ఎల్.ఆకాంక్ష, ఎం.సంజన, బి.స్నేహిత, జి.పూజ, కె.అనుశ్రీ, పి.జయశ్రీ, కె.అనుశ్రీ, కె.హర్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల జూనియర్ కళాశాల/పాఠశాలకు చెందిన విద్యార్థులు 10వ జోనల్‌స్థాయి పోటీల్లో ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 18న నిజామాబాద్‌లోని కంజర గ్రామంలో నిర్వహించిన టెన్నికాయిట్ అండర్–19 విభాగంలో పాఠశాలకు చెందిన కె నిరోజ, జె.రుచితలు ప్రతిభను కనబర్చి మొదటి బహుమతి సాధించారు. అండర్–17విభాగంలో క్యారమ్ పోటీల్లో కావేరి, గంగోత్రి ద్వితీయ బహుమతి సాధించారు. ఈపోటీల్లో అండర్–19విభాగం నుంచి రాష్ట్రస్థాయి టెన్నీకాయిట్ పోటీలకు కె.నిరోజ, జె.రుచితి ఎంపికయ్యారు. కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు సీహెచ్.అపర్ణ ఎంపికై ంది. అండర్–19 ఖోఖో పోటీలకు జి.మానస, అండర్–17 విభాగంలో కబడ్డీ పోటీలకు కీర్తన అనే విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాధిక వివరించారు. వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు సీనియర్ వైస్‌ప్రిన్సిపాల్ నిహారిక, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ స్వరూప, పీఈటీ సుస్మిత, పీఈటీ సుప్రియ అభినందించారు.
సాంఘిక సంక్షేమ పాఠశాలకు ఓవరాల్ చాంపియన్‌షిప్
రాష్ట్రస్థాయికి 17మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment