నిజామాబాద్: ‘పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనలో సైంటిఫిక్, ఎకనామికల్, ట్రెడిషన్, కల్చర్ ఎమోషనల్ పని చేశాయి. సందర్భానుసారంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలు, నేను పడ్డ శ్రమకు ఫలితం వచ్చింది’ అని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని బీ జేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పలువురు తనకు రాజకీయాలకు అతీతంగా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు. పసుపు నా టిన దగ్గర నుంచి మార్కెటింగ్ వరకూ పసుపు బో ర్డు ఉపయోగపడుతుందని, కోల్డ్ స్టోరేజీలు, గోదా ములు, వేర్‌హౌజ్‌లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల కోసం అవసరాన్ని బట్టి స్పైసెస్ రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామ న్నారు.
ఇందుకు రూ.30 కోట్లు ఖర్చు చేశామని, బంగ్లాదేశ్‌కు రైలు ద్వారా పసుపు ఎగుమతి చేశామ న్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేయడం చాలా సంతో షంగా ఉందన్నారు. పసుపు రైతుల కల నెరవేరిందని, ప్రతీ రైతుకు ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇందూరు నుంచే మార్పు..
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసి రాజకీయాల్లో మార్పునకు ఇందూరు నుంచే శ్రీకారం చుడతామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం దొరతనం, అహంకారం దించే వరకూ ఇ లాగే మాట్లాడతానన్నారు.
ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్.. ప్రధాని మోదీని మోసగా డు అంటారా? అని మండిపడ్డారు. బిడ్డా కేటీఆర్ జా గ్రత్త.. ధాన్యం బ్లాక్‌మార్కెట్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న నీవు కవిత కంటే ముందే జైలు వెళ్తావని హెచ్చరించారు. నరేంద్ర మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలకాలని, ఆ నీతి నేర్చుకోవాలని హితవుపలికారు.
సభను జయప్రదం చేయండి..
పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ‘ఇందూరు జనగర్జన’ సభకు మంగళవారం రైతులు, ప్రజలు, యువత, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని అర్వింద్ కోరారు.
సమావేశంలో పార్టీ నేత ధన్‌పాల్ సూర్యనారాయణ పసుపు కొమ్ముల దండతో అర్వింద్‌ను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయం బయట ఎంపీ సహా నాయకులు పసుపు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లాల అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ, తుల ఉమ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, బోగ శ్రావణి, పైడి రాకేశ్ రెడ్డి, దినేశ్ కులాచారి, మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, న్యాలం రాజు, స్వామి యాదవ్ పాల్గొన్నారు.
► ‘మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం’ అని ప్రధాని మోదీ నా ట్వీట్‌కు రీ ట్విట్ చేశారు.
► పసుపు బోర్డు, మాధవనగర్ ఆర్‌ఓబీ పూర్తయితే నిజామాబాద్‌కు ఎప్పటికీ నీవే ఎంపీవని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి, రైతుల ప్రశంసలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
► పసుపు బోర్డు ప్రకటన తర్వాత రాజకీయ నాయకుల మీద మళ్లీ భరోసా ఏర్పడిందని ఓ రైతు కామెంట్ చేశాడు.
► పసుపు బోర్డు కోసం ఓ కేంద్రమంత్రి వెంటబడి సతాయించాను. లెక్కలేనన్ని సార్లు ఆయన కార్యాలయానికి వెళ్లి ఆయనతో పాటు సిబ్బందిని ఇబ్బంది పెట్టాను. చివరకు ఫలితం రావడం ఆనందంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment