సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ప్రచార ఘట్టం నేపథ్యంలో గ్రామాల్లో ఎవరైనా నిలదీసినా, ప్రశ్నించినా సదరు వ్యక్తులను భయపెట్టాలని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయాలంటూ జిల్లాలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులకు, తృతీయ శ్రేణి కేడర్‌కు సూచిస్తుండడం చర్చనీయాంశమైంది.'
జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలా ఉచిత సలహాల నేపథ్యంలో తమకు ఇదేం పరిస్థితని ఆయా నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు అసహనం వ్యక్తం చే స్తుండడం విశేషం. ప్రజలతో సౌమ్యంగా ఉండాల్సిన నేపథ్యంలో ఇలాంటి వ్యవహారశైలి కలిగిన సదరు సిట్టింగ్ చెప్పినట్లు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చర్చించుకుంటుండడం గమనార్హం.
ఇప్పటికే వ్యతిరేకత..
తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మె ల్యే ఓటమిపాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్యేతో కలిసి ఉంటే తర్వాత అవస్థలు పడాల్సి ఉంటుందని బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమకు బిల్లులు రాక నానా అగచాట్లు పడుతున్నామని, ఎమ్మెల్యే కూడా బిల్లులకు అడ్డం పడిన సందర్భాల్లో ఆత్మహత్యయత్నాలు చేసిన ఘ టనలు కూడా చోటు చేసుకున్నా యి.
దీంతో మెజారిటీ సంఖ్యలో సర్పంచ్‌లు విషయాలపై అంతర్గతంగా సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సర్పంచ్‌లు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు బీ జేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తగిన సమయం చూసి ఆయా పార్టీల్లో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వకూడదని ఇప్పటికే పలువురు స్థానిక ప్ర జాప్రతినిధులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సదరు ఎమ్మెల్యే ప్రవర్తన, వ్యవహారశైలితో తాము విసిగిపోయామని, మళ్లీ ఆ ఎమ్మెల్యేతో తిరిగితే ఇబ్బందు లు తప్పవనే ఆలోచనతో ముందే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం విశేషం. ఇచ్చిన హామీలు నెరవేర్చి తే హుందాగా ఓట్లడిగే అవకాశాన్ని వ దులుకుని ఇప్పుడు తమతో ఓటర్ల కు తాయిలాలు పంచిస్తే లాభం లేదని సర్పంచ్‌లు, ఉప స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు చెబుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment