నాణ్యమైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

Published Thu, Jan 30 2025 1:41 AM | Last Updated on Thu, Jan 30 2025 1:41 AM

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

సుభాష్‌నగర్‌: వినియోగదారులకు నాణ్యమైన వి ద్యుత్‌ అందించడమే లక్ష్యంగా పని చేయాలని నోడ ల్‌ అధికారి, చీఫ్‌ ఇంజినీర్‌ (ఆపరేషన్‌–1, వరంగల్‌) బూస అశోక్‌ సూచించారు.బుధవారం నగరంలోని ఎస్‌ఈ కార్యాలయంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ఎస్‌ఈ, డీఈ, ఏడీఈలతో సమావేశం నిర్వహించారు. అశోక్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.ఆరు కోట్లతో ఆరు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నూతనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.13.1 కోట్లతో 33 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ లైన్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.5కోట్లతో కొత్త వీసీబీలు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. వేసవిలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి కృషి చేస్తామన్నారు. పెండింగ్‌ పనులను ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ రాపల్లి రవీందర్‌, ట్రాన్స్‌ కో ఎస్‌ఈ సూర్య నర్సింహారావు, డీఈలు రమేశ్‌, పీవీ రాజేశ్వర్‌రావు, జాడే ఉత్తమ్‌, ఎండీ ముక్తార్‌, వెంకట రమణ పాల్గొన్నారు.

జిల్లాకు మూడో స్థానం

ఎన్‌పీడీసీఎల్‌ కంపెనీలో ఉత్తమ సేవలకుగాను జిల్లాకు మూడోస్థానం లభించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పథకాలను ప్రకటించారు. ఈ మేరకు సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ బూస అశోక్‌ నిజామాబాద్‌ ఎస్‌ఈ రాపల్లి రవీందర్‌కు సర్టిఫికెట్‌, మెమెంటోను అందజేశారు.

నోడల్‌ అధికారి, చీఫ్‌ ఇంజినీర్‌ బూస అశోక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement