పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ

Published Fri, May 24 2024 9:15 AM

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ

గుడివాడటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో తమ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించినట్లు ఎన్టీఆర్‌ స్టేడియం మేనేజర్‌ ఎం. సత్యనారాయణ గురువారం తెలిపారు. ఈనెల 20వ తేదీ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పోటీలలో తమ క్రీడాకారులు ఎం.కుమార్‌ రాజా 59 కిలోల విబాగంలో 367.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. అలాగే కె.వరుణ్‌ రుత్విక్‌ 66 కిలోల విభాగంలో 208 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. రాజా 59 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. సాయి 85 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం అందుకున్నాడు. వి. భగత్‌ బాలాజి 74 కిలోల విబాగంలో 365 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. అజయ్‌దేవాన్‌ 83 కిలోల విభాగంలో 435కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. లక్ష్మణ్‌బాబు 105 కిలోల విభాగంలో 475 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, నక్కా వీరనాగు అను 47 కిలోల విభాగంలో 210 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, పి. స్వాతిశ్రీ 84 కిలోల విభాగంలో 197.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు జిమ్‌ కోచ్‌ మారెళ్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ కోచ్‌ జంపా ఉషాకుమారిలను స్టేడియం యాజమాన్యం అభినందించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement