అక్రమాల ప్లానింగ్‌పై కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పెనమలూరు మండల పరిధిలోని తాడిగడప మునిసిపాలిటీలో హైడ్రామా నెలకొంది. ఉన్నతాధికారులు టీపీఓపై వేటు వేయగా, అక్రమాలు ఎక్కడ తన తలకు చుట్టుకుంటాయోనన్న ఒత్తిడితో ఏసీపీ సెలవుపై వెళ్లారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పేందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి తనకు అనుకూలమైన ఇద్దరు అధికారులు తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస కథనాలతో స్పందన
తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలకు స్పందించిన మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు అక్రమాలపై మునిసిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై ఎట్టకేలకు కన్నెర్ర చేశారు. అక్రమాలపై నివేదిక సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పట్టణ పరిధిలో అనధికార లేఅవుట్లు, అనధికార భవన నిర్మాణాలు, తీసుకున్న ప్లానుకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు మునిసిపల్ కమిషనర్ ఆదేశించారు. పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ లేఅవుట్ల విషయంలో హద్దు రాళ్లు తొలగించి హడావుడి చేశారు. ఆ లేఅవుట్లల్లో వేసిన రోడ్లను తొలగించలేదు. వందలాదిగా భవనాల నిర్మాణం అక్రమంగా జరిగినా వదిలేశారు. తూతూ మంత్రంగా నివేదికలు సమర్పించారు. ఈ నివేదికలు సమగ్రంగా లేకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు టీపీఓను టౌన్ ప్లానింగ్ విభాగానికి సరెండర్ చేశారు.
సంతకాలు పెట్టాల్సిందే...
అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల నిర్మాణాలకు సంబంధించి చిక్కుల్లో పడతామని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల ఇంటి ప్లాన్‌లు ఇవ్వటం నిలిపివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటిప్లాన్‌లు ఇచ్చేలా చూడాలని టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై రియల్టర్లు ఒత్తిడి తీసుకుకొచ్చారు. తాను అడిగిన ఫైల్స్‌పై సంతకాలు పెట్టాల్సిందేనని నియోజకవర్గ ప్రజాప్రతినిధి టౌన్ ప్లానింగ్ విభా గంపై ఒత్తిడి తేవడంతో వారు చేతులెత్తేశారు. తమ ఉద్యోగాలు పోగొట్టుకోలేమని, ప్లాన్లు జారీచేయలేమని ప్లానింగ్ అఽధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అక్రమ వ్యవహారాల్లో తలదూర్చితే ఇరుక్కుపోతాననే భయంతో ఇప్పటికే ఏసీపీ సెలవు పెట్టారని సమాచారం. ఇదే అదనుగా పావులు కదిపిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమకు అనుకూలమైన ఇద్దరు అధికారులను నందిగామ మునిసిపాలిటీ, ఉయ్యూరు నగర పంచా యతీ నుంచి తాడిగడప మునిసిపాలిటీకి తీసుకొచ్చి టౌన్ ప్లానింగ్ పగ్గాలు అప్పగించేలా ప్రణాళిక రచించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘సాక్షి’ కథనాలతో తాడిగడప టీపీఓ బదిలీ ఒత్తిడి నేపథ్యంలో సెలవుపై వెళ్లిన ఏసీపీ ప్లానింగ్ విభాగానికి కొత్తగా ఇద్దరు అధికారులు రాక
ఇప్పుడేమి చేస్తారు.?
టౌన్ ప్లానింగ్‌లో కొత్తగా పగ్గాలు చేపట్టిన అధికారులు నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు అధికారుల్లో ఒకరు కానూరు, మరొకరు యనమలకుదురును చూసుకోవాలని ఆ ప్రజాప్రతినిధి సూచించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోనే అక్రమ దందా జరుగుతుండటంతో కొత్తగా వచ్చిన అధికారులు ఏమి చేస్తారనేది చర్చనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment