కదం తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు

Published Wed, Jan 29 2025 1:22 AM | Last Updated on Wed, Jan 29 2025 1:22 AM

కదం త

కదం తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు

అవనిగడ్డ: డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు కదం తొక్కారు. డీఐఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో మంగళవారం రాస్తారోకో చేశారు. నోటిఫికేషన్‌ వెంటనే ప్రకటించాలని, కూటమి ప్రభుత్వ మొదటి సంతకం హామీ నెరవేర్చి తమకు న్యాయం చేయాలని నినదించారు. తొలుత స్థానిక గ్రంథాలయం సెంటర్‌ నుంచి వంతెన సెంటర్‌ వరకూ ప్లకార్డులతో ర్యాలీ చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

మొదటి సంతకం ఏమైంది?

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటిగా అమలు చేసేది డీఎస్సీ నోటిఫికేషన్‌ అని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఏడు నెలలు అయినా డీఎస్సీ ఊసేలేదని, దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ డీఎస్సీ గురించి ఎక్కడా నోరు మెదపడం లేదని, కనీసం విద్యాశాఖా మంత్రి అయినా ప్రకటన చేసింది లేదని విమర్శించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పదిలక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని రామన్న తెలిపారు. డీఎస్సీకి ప్రిపేర్‌ అవ్వాలో వద్దో తెలియని గందరగోళంలో అభ్యర్థులు ఉన్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తక్షణమే నోటిఫికేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అవనిగడ్డలో రాస్తారోకో మొదటి సంతకం ఏమైందనిప్రభుత్వానికి సూటి ప్రశ్న అభ్యర్థుల ధర్నాతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

16 వేల పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇవ్వాలి

కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16 వేల టీచర్‌ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇవ్వాలని రామన్న డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులపై పోలీసుల దురుసు ప్రవర్తన మంచిదికాదన్నారు. కడుపు మండి ఆందోళన చేస్తున్నారని, రాజకీయాల కోసం కాదని రామన్న చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీఎస్పీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అభ్యర్థులను అడ్డుకున్న ఎస్‌ఐ

రాస్తారోకో విరమించాలంటూ డీఎస్సీ అభ్యర్థులకు ఎస్‌ఐ శ్రీనివాస్‌ అడ్డుకున్నారు. ప్రకటనలు, వినతి పత్రాలు ఇస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే రాస్తారోకో చేస్తున్నామని అభ్యర్థులు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు. కొద్దిసేపటి తరువాత అభ్యర్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు రఘు, కృష్ణ, ఆంజనేయులు, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కదం తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు 1
1/1

కదం తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement