పక్కా ఇళ్లు వద్దు.. పాత ఇళ్లు చాలు | - | Sakshi
Sakshi News home page

పక్కా ఇళ్లు వద్దు.. పాత ఇళ్లు చాలు

Published Wed, Jan 29 2025 12:37 AM | Last Updated on Wed, Jan 29 2025 12:37 AM

పక్కా

పక్కా ఇళ్లు వద్దు.. పాత ఇళ్లు చాలు

మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి ముదిలిపొడలో బోండా గిరిజనులు నివసిస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు ఆ పంచాయతీకి మంగళవారం వెళ్లారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలియజేశారు. అయితే తమకు పక్కా ఇళ్లు అవసరం లేదని, తమ పాత ఇళ్లు ఉంటే చాలని పేర్కొన్నారు. దీంతో వారిలో చైతన్యం కల్పించడం కోసం అవగాహన చర్యలు చేపట్టారు. ఇటీవల మల్కన్‌గిరి జిల్లా పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం ప్రభాతిపొరిడా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గిరిజనులకు ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు. దీంతో జిల్లా పరిపాలన విభాగం చీఫ్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నరేష్‌ చంద్ర శభర ఇతర ఉన్నత అధికారులు ముదిలిపొడ, హండ్రాహల్‌ తదితర గ్రామాలకు చేరుకొని ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. దీనికి కొంతమంది గిరిజనులు అంగీకరించారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అయితే గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆవాసాలను వదులుకోవడానికి సిద్ధపడడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పక్కా ఇళ్లు వద్దు.. పాత ఇళ్లు చాలు1
1/1

పక్కా ఇళ్లు వద్దు.. పాత ఇళ్లు చాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement