బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

Published Wed, Jan 29 2025 12:36 AM | Last Updated on Wed, Jan 29 2025 12:36 AM

బుధవా

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

సీఎం మోహన్‌

చరణ్‌ మాఝి

భువనేశ్వర్‌: రాష్ట్రంలో వ్యాపారాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి అన్నారు. స్థానిక జనతా మైదాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఉత్కర్ష్‌ ఒడిశా, మేక్‌ ఇన్‌ ఒడిశా కాంక్లేవ్‌ – 2025 వేదికపై ఆయన ప్రసంగించారు. వికసిత్‌ ఒడిశా, వికసిత్‌ భారత్‌ దృక్పథానికి రాష్ట్రంలో అనుకూలమైన వనరులు, వ్యాపార కార్యకలాపాలకు అధునాతన సౌకర్యాలు పుష్కలమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో సూక్ష్మ, మధ్య, లఘు వ్యాపారాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో జౌళి, ఆహార ఉత్పాదన, అల్యూమినియం వంటి పరిశ్రమల కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇటీవల సింగపూర్‌ అధ్యక్షుడి పర్యటన పురస్కరించుకుని సింగపూర్‌ సంస్థలతో 8 వ్యాపార ఒప్పందాలు ఖరారు కావడం ప్రపంచ భాగస్వామ్యాలు మరియు ఆవిష్కరణలకు తమ నిబద్ధతను మరింత బలోపేతం చేసిందని వెల్లడించారు. పెట్రో కెమికల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఐటీ, జౌళి మరియు మెటల్‌ పారిశ్రామిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఒడిశా ఆహ్వానిస్తుందన్నారు. 2036 నాటికి వికసిత్‌ ఒడిశా సంకల్ప సిద్ధికి అద్భుతమైన వృద్ధి ప్రయాణంలో తమతో చేరి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భువనేశ్వర్‌: అభివృద్ధిలో ముందుకెళ్తున్న ఒడిశా రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఉత్కర్ష్‌ ఒడిశా–2025, మేక్‌ ఇన్‌ ఒడిశా కాంక్లేవ్‌ సదస్సులను పీఎం నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు సాగనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. వ్యాపార అనుకూల అవకాశాలు, కొత్త వ్యాపార విధానాల ఆవిష్కరణకు ఒడిశాలో పుష్కలంగా వనరులు ఉన్నాయన్నారు. వికసిత్‌ భారత్‌ సాకారం వాస్తవ కార్యాచరణలో ఈ సదస్సు తీర్మానాలు సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధునాత వర్తక ఆవిష్కరణలకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రాచీన కాలం నుంచి ఒడిశా వర్తక వ్యాపారాలకు అనుకూలమైన ప్రాంతంగా చరిత్ర పుటలు వర్ణిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఓడరేవులు, ఏటా నిర్వహించే వ్యాపార వారసత్వ బాలి జాతర వంటి సంప్రదాయాలు ప్రాచీన వర్తక అనుకూలతకు నిలువెత్తు తార్కాణాలుగా పేర్కొన్నారు.

చరిత్ర పునరావృతం

21వ శతాబ్ధంలో వాణిజ్యం మరియు వ్యాపార సాంస్కృతిక కేంద్రంగా ఒడిశా ఘన చరిత్ర పునరావృతం కానుందని పీఎం పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్‌ అధ్యక్షుడి పర్యటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఆయన పర్యటన పురస్కరించుకుని పలు వ్యాపార ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. పరిశ్రమల నిర్వహణకు అవాంఛనీయ ఖర్చులను నివారించి పారిశ్రామిక విస్తరణకు భారీ పెట్టుబడులను ఆకట్టుకునే ఒడిశా కార్యశైలి పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటోందన్నారు. ప్రధానంగా మౌలిక వనరులు, రవాణా అనుసంధానం రంగాల పటిష్టతపై రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రైల్వేలు, జాతీయ రహదారులు మరియు ఓడ రేవులను అభివృద్ధి చేయడంలో వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఉల్క తదితరులు

కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థినులు

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20251
1/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20252
2/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20253
3/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20254
4/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20255
5/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20256
6/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20257
7/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20258
8/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20259
9/9

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement