బీఎస్ఎఫ్ సేవా శిబిరానికి స్పందన
మల్కన్‌గిరి : జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ఖల్గూఢ గ్రామం వద్ద 180 బెటాలియాన్ జవాన్లు బుధవారం జన సంపర్క్ శిబిరం ఏర్పాటు చేశారు. ఆండ్రాహళ పంచాయతీ పరిధిలోని సింద్రీగూడ, కందిపోదర్, వాల్యపదర్, బద్బేల్ గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించారు. నిత్యావసర సరుకులు, దుస్తులు, క్రీడా కిట్లు పంపిణీ చేశారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి బీఎస్ఎఫ్ సహాయ సహకారాలు అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొరాపూట్ బీఎస్ఎఫ్ రెండో కమాండర్ సత్యేంద్రకుమార్ రీడర్, డిప్యూటీ కమాండార్ రాకేష్‌కుమార్, సునీల్ కుమార్ జాకబ్, ఆండ్రాహల్ 180 బెటాలియాన్ కమాండర్ విజయ్‌కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment