భువనేశ్వర్: కాలేజ్ అకౌంట్స్ పోర్టల్ అప్లికేషన్ (క్యాపా) మాడ్యూల్‌లో కళాశాల ఖాతాలను నిర్వహించడంలో విఫలమైనందుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ 63 ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల వేతనాలను నిలిపివేసింది. ఈ మేరకు అకౌంట్స్ ఆఫీసర్ జుమార్‌కుమార్ మాఝీ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాపా నిబంధనల ప్రకారం కార్యాచరణ పాటించే వరకు జీతాల నిలిపివేత నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. క్యాపా పోర్టల్‌లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల ఖాతాలను నవీకరించడానికి ఉన్నత విద్యా శాఖ పలుమార్లు ముందస్తుగా హెచ్చరించిన పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నటట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 11 మందికి, ఖుర్ధాలో 8 మందికి, గంజాంలో 8 మందికి, జగత్‌సింగ్‌పూర్‌లో ఐదుగరికి, కటక్, బాలాసోర్‌లో నలుగురు, పూరీలో ముగ్గురు చొప్పున ప్రిన్సిపాల్స్ వేతనాలు నిలిపి వేశారు. కాలేజ్ అకౌంట్స్ పోర్టల్ అప్లికేషన్ కళాశాలల ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించడానికి దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment