వివాహిత ఆత్మహత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి చంద్రగిరిలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలు టున్ని గొండాల్ (33)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
మృతురాలి భర్త అజంత్ గొండాల్ చంద్రగిరిలో మెడికల్ షాప్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటి తలుపును ఎంతసేపు కొట్టినా అతని భార్య తీయకపోవడంతో తలుపులు విరగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే ఆమె చీర సాయంతో ఉరివేసుకుని ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు.
అనుమానాస్పదంగా యువకుడి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఆరోగ్య కేంద్రానికి వెనుకవైపు మంగళవారం మధ్యాహ్నం చెట్టుకు వేలాడుతూ యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. కలిమెల సమితి తుంబగూడ గ్రామానికి చెందిన కై లాస్ మడ్కమి (22) అనే యువకుడు సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో అతని తండ్రి పదియా మడ్కమి కలిమెల పోలీసులకు మంగళవారం ఉదయం ఫిర్యాదు చేశాడు. అయితే కలిమెల ఆరోగ్య కేంద్రానికి వెనుకవైపు అనుమానాస్పదంగా కై లాస్ మృతదేహం ఉరివేసుకొని ఉండడం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం వివరాలు వస్తే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment