పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా, నువాగడ సమితిలకు చెందిన పది పంచాయతీల ప్రజలు తమకు కొత్తగా సుందర్డంగ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ బిజయ కుమార్ దాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనివలన తమ పంచాయతీల్లో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పంచాయతీల ప్రజలు పింఛన్లు, ఉపాధి తదితర ప్రభుత్వ పథకాల కోసం ఆయా సమితి కేంద్రాలకు చేరుకోవాలంటే సుమారు 50 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ్ మఝి, మాజీ జెడ్పీటీసీ నువాగడ జేమ్స్ రైకా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment