‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూములు లాగేసుకుంటారు.. వ
అమరావతి: పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఈ నెల 20వ తేదీ నుంచి రీ సర్వే మొదలు పెట్టారు. బ్రిటిషు ప్రభుత్వ హయాంలో సర్వే చేయగా.. మళ్లీ ఇప్పుడు సర్వే చేసి అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. రీసర్వేతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. పల్నాడు జిల్లాలోని 28 మండలాలలో మూడు విడతల్లో 349 గ్రామాలకుగాను 150 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసింది. రెండు లక్షల మందికిపైగా రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చింది. మిగతా గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఎన్నికలు జరగడంతో నిలిచి పోయింది. జిల్లాలో రెండు విడతలలో 3,87,822 ఎకరాలను సర్వే చేసి హద్దు రాళ్లు పాతారు. ప్రస్తుతం రీసర్వే పూర్తయి భూముల సరిహద్దు రాళ్లపై ఉన్న పేరును తుడిచి వేయటానికి పాలకులు నిర్ణయించారు. రాళ్లపై ఉన్న అక్షరాలు తొలగించటానికి రూ. కోట్లు ఖర్చు చేయటానికి సిద్ధమయ్యారు.
మండలానికో పైలట్ గ్రామం ఎంపిక
జిల్లాలోని 25 గ్రామాలలో రీసర్వే డీటీలు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు బృందాలు సర్వే చేస్తున్నారు. మాచర్ల మండలంలో ముత్యాలంపాడు, కారంపూడి – చినకొదమగుండు, రెంటచింతల – మల్లవరం, గురజాల – పల్లెగుంత, దుర్గి – దుర్గి, పిడుగురాళ్ళ– జానపాడు, దాచేపల్లి – పొందుగల, మాచవరం – తాడుట్ల, వెల్దుర్తి – మండాది, అచ్చంపేట– కస్తల, బెల్లంకొండ – వెంకటాయ పాలెం, క్రోసూరు – అందుకూరు, అమరావతి – నరుకుళ్ళపాడు, పెదకూరపాడు – లింగంగుంట్ల, సత్తెనపల్లి – కంకణాలపల్లి, ముప్పాళ్ళ – నార్నెపాడు, రాజుపాలెం – గణపవరం, నెకరికల్లు – చాగల్లు, బొల్లాపల్లి – సరికొండపాలెం, నూజెండ్ల – త్రిపరాపురం, రొంపిచెర్ల – గొగులపాడు, చిలకలూరిపేట – కావూరు, శావల్యాపురం – కొత్తలూరు, ఈపూరు – కొచ్చెర్ల, వినుకొండ మండలంలో ఏనుగుపాలెంలో సర్వే చేయనున్నారు.
సదస్సులతో ప్రయోజనం శూన్యం
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రైతుల సదస్సుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇటీవల మొదలు పెట్టిన రీసర్వే కూడా గతంలో చేసిందే. సర్వే రాళ్లపై గత ప్రభుత్వ ఆనవాళ్లను తొలగించటమే రీసర్వే లక్ష్యంగా ఉంది.
– వై. గోపాలరావు, రైతు సంఘం
అధక్షుడు, పల్నాడు జిల్లా
సర్వేలో మార్పు లేదు
గతంలో మా పొలంలో సర్వే ఒకసారి రాళ్లు పాతారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేయాలని పిలుస్తున్నారు. పూర్తయ్యాక అప్పటికి, ఇప్పటికి కొలతలలో తేడా లేదని చెబుతున్నారు.
– దొప్పలపూడి వీరశేఖర్, రైతు,
నరుకుళ్ళపాడు, అమరావతి మండలం
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
రైతుల సమక్షంలోనే రీసర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చాం. గతంలో చేసిన డ్రోన్ సర్వే, ,గ్రౌండ్ ట్రూతింగ్ ద్వారా మళ్లీ కొలతలు తీస్తున్నాం. దీని గురించి రైతులకు వివరిస్తున్నాం. అంగీకారం కోసం కృషి చేస్తున్నాం.
– సీహెచ్ భానుకీర్తి,
సర్వే ఏడీ, పల్నాడు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment