స్టడీ మెటీరియల్‌ ఏదీ ? | - | Sakshi
Sakshi News home page

స్టడీ మెటీరియల్‌ ఏదీ ?

Published Fri, Jan 31 2025 2:18 AM | Last Updated on Fri, Jan 31 2025 2:18 AM

స్టడీ మెటీరియల్‌ ఏదీ ?

స్టడీ మెటీరియల్‌ ఏదీ ?

● టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు 100 రోజుల ప్రణాళిక ● ఇప్పటి వరకు స్టడీ మెటీరీయల్‌ పంపిణీ చేయని ప్రభుత్వం ● పరీక్షలకు ఇంకా 42 రోజులే.. ● సాధనకు విద్యార్థుల ఇబ్బందులు

డివిజన్‌ పాఠశాలల సంఖ్య టెన్త్‌ విద్యార్థులు

నరసరావుపేట 102 5,616

సత్తెనపల్లి 66 4,229

గురజాల 86 5,115

మొత్తం 254 14,960

సత్తెనపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యాశాఖ తయారు చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందజేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్‌ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ విద్యార్థులపైనే భారం వేస్తున్నారు. ఏటా జిల్లా పరిషత్‌ నుంచి స్టడీ మెటీరియల్‌ ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు మెటీరియల్‌ పంపిణీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన క్వశ్చన్‌ బ్యాంక్‌, మోడల్‌ ప్రశ్న పత్రాలతో కూడిన బుక్‌లెట్లను పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో వచ్చిన వాటిని అలాగే స్కూళ్లకు పంపించారు. విద్యార్థుల్ని ప్రింట్‌ తీసుకొని చదువుకోవాలని సూచించారు. లాంగ్వేజెస్‌ బుక్‌ లెట్‌ 198, నాన్‌ లాంగ్వేజెస్‌ 218 పేజీలు ఉంది. ఈ రెండిటినీ ప్రింట్‌ తీసుకోవాలంటే ఒక్కో పేపర్‌కు కనీసం రూ. 2 చొప్పున తీసుకుంటారు. దీనివల్ల విద్యార్థులపై స్టడీ మెటీరియల్‌ భారం రూ.కోట్లలో పడుతోందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గడిచిపోయిన 58 రోజులు..

మార్చి 17 నుంచి 31వరకు టెన్త్‌ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఇంకా 42 రోజులు మాత్రమే మిగిలింది. మెరుగైన ఫలితాల సాధన దిశగా 100 రోజులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో 58 రోజులు గడిచిపోయాయి. 100 రోజుల ప్రణాళిక కంటే ముందే విద్యార్థులకు అవసరమైన మెటీరియల్‌ పంపిణీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు అందజేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement