పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Fri, Jan 31 2025 2:17 AM | Last Updated on Fri, Jan 31 2025 2:17 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2025

విగ్రహాలకు ముసుగులు

నరసరావుపేటఈస్ట్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావటంతో పట్టణంలోని రాజకీయపార్టీల నాయకుల విగ్రహాలకు మున్సిపల్‌ సిబ్బంది ముసుగులు తొడుగుతున్నారు.

వాల్‌పోస్టర్స్‌ ఆవిష్కరణ

బాపట్ల : స్పర్శ కుష్ఠు నివారణ పక్షోత్సవాల సందర్భంగా గురువారం వాల్‌పోస్టర్స్‌ను కలెక్టర్‌ జె.వెంకట మురళి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 13 వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 552.80 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,700 క్యూసెక్కులు విడుదలవుతోంది.

సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్‌: రూ.400 కోట్లతో ఉడాయించిన చిట్‌ఫండ్‌ వ్యాపారి ఉదంతం రోజురోజుకు మలుపుతిరుగుతోంది. మొదట రూ.150 కోట్లతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావించారు. తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో ఆ మొత్తం సుమారు రూ.400 కోట్లకు చేరింది. ప్రైవేట్‌ చిట్స్‌, రియల్‌ఎస్టేట్‌ పేరుతో నమ్మకంగా వ్యాపారం చేస్తూ ఎంతోమంది వద్ద రూ.కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ప్రజల సొమ్ముతో విలాసవంత జీవితాన్ని గడుపుతూ చివరకు రాత్రికిరాత్రే కుటుంబంతో సహా పరారయ్యాడు. స్థానికులతోపాటు అనేక ప్రాంతాల వారు అతని వద్ద చీట్టీల సభ్యులుగా చేరారు. గత 25 ఏళ్ల నుంచి పల్నాడు రోడ్డులో బహుళ అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకొని చిట్‌ఫండ్‌ నిర్వహిస్తూ జనాల్ని ఆకట్టుకున్నాడు. అధిక వడ్డీలకు డబ్బు తీసుకొని సకాలంలో చెల్లించాడు. దీంతో ప్రజలు అతని ఆశల వలలో పడి దారుణ మోసానికి గురయ్యారు. రిజిస్ట్రేషన్‌ సంస్థలో చిట్‌ వేశాం తమ డబ్బులకు ఢోకా లేదనుకున్న సభ్యులు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి విచారణ చేయగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. దీంతో బాధితులంతా గుండెలు బాదుకుంటున్నారు.

బురిడీకి ఐదేళ్ల ముందే బీజం..

పరారైన చిట్‌ఫండ్‌ వ్యాపారి సంస్థకు సంబంధించి 2020 తరువాత కొత్త చిట్‌లకు సంబంధించి ఎటువంటి అధికారిక రిజిస్ట్రేషన్‌ లేదు. నిబంధనల ప్రకారం ఓ చీటి పాట మొదలయ్యే సమయంలో సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చీటి పాట విలువ కలిగిన మొత్తం డిపాజిట్‌ చేసి ప్రీవియస్‌ శాంక్షన్‌ ఆర్డర్‌(పీఎస్‌ఓ) నంబర్‌ పొందాల్సి ఉంటుంది. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన చిట్‌ఫండ్‌ సంస్థ గత నాలుగేళ్లుగా కొత్త చీటిపాట కోసం ఎటువంటి అనుమతులు పొందలేదని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే డబ్బులతో ఉడాయించేందుకు ముందుగానే వ్యూహం పన్నినట్టుగా స్పష్టమవుతోంది. అయితే ఈ నాలుగేళ్ల వ్యవధిలో అనధికారికంగా రూ.80 లక్షల చిట్‌లు మూడు, రూ.50 లక్షల చిట్స్‌ నాలుగు, రూ.30 లక్షల చిట్స్‌ మరో నాలుగుతోపాటు మరిన్ని నిర్వహించి సభ్యుల చేత భారీ స్థాయిలో డబ్బులు కట్టించుకున్నట్టు సమాచారం. చిట్‌ఫండ్‌ సంస్థ ఇచ్చిన రశీదులతో బాధితులు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి విచారించగా అవి అనధికారికమైనవని తేల్చారు. జిల్లాలో నమోదైన 23 చిట్‌ఫండ్‌ సంస్థలకు సంబంధించి 2019 ఏడాదికిగాను నరసరావుపేట రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 70 చీటిపాటలకు మాత్రమే పీఎస్‌ఓ నంబర్లు కేటాయించినట్టు రికార్డులు చెబుతున్నాయి.. ప్రస్తుతం పరారైన చిట్‌ఫండ్‌ కంపెనీకి సంబంధించిన ఓ బాధితుడు తెచ్చిన

రశీదుపై పీఎస్‌ఓ నంబర్‌ 104 ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. తాము ఆ ఏడాదిలో కేవలం 70 చిట్స్‌కే అనుమతులిస్తే 104 నంబర్‌తో రశీదు ఎలా విడుదల చేశారంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. నకిలీ పీఎస్‌ఓ నంబర్‌తో ప్రజలను మోసం చేసినట్టు రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాఽధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో తామేమీ చేయలేమంటున్నారు.

7

న్యూస్‌రీల్‌

రేపటి నుంచి

కందులు కొనుగోలు

కొరిటెపాడు(గుంటూరు): పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కందులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని గుంటూరు, పల్నాడు జిల్లాల మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ ఆర్‌జే కృష్ణారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రైతులు పండించిన కంది పంటను కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,550లకు నాఫెడ్‌ తరపున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ముందుగా కందులు పండించిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 202 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం జరిగిందని వెల్లడించారు. కోసిన కంది పంటను నూర్పిడి చేసి బాగా ఆరబెట్టి శుభ్రం చేసుకోవాలని, శుభ్రం చేసిన కందులలో తేమ శాతం 12 శాతం లోపు ఉండేట్లు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు తమ కందులను తమ సొంత గోనె సంచులలోనే తమకు కేటాయించిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు తమ కంది పంట ఈ–క్రాప్‌ బుకింగ్‌లో నమోదు అయినదో లేదో సంబంధింత రైతు సేవా కేంద్రంలో చూసుకోవాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు కానటువంటి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో పాటు రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని సూచించారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయనున్నట్టు ఆయన వివరించారు.

ప్రజల సొమ్ముతో సోకు..

చీటిపాటలు, వడ్డీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో చిట్‌ఫండ్‌ వ్యాపారి విలాసవంత జీవితాన్ని గడిపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రామిరెడ్డిపేటలో సుమారు 15 సెంట్ల స్థలంలో రూ.20 కోట్లతో అత్యాధునిక హంగులతో భారీ ఇంటి నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. తన కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా కాబోయే కోడలికి రూ.5 కోట్లతో వజ్రాభరణాలు, రూ.3 కోట్లతో బంగారు నగలు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చెబుతున్నారు. నిర్మించబోయే ఇంటిని చూపించి బ్యాంక్‌ లోన్‌ రాగానే డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి పలువురి వద్ద పెద్దమొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకున్నాడట. బాధితుల్లో పట్టణ వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయితే లెక్కలు చూపని డబ్బు కోట్ల రూపాయలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/6

పల్నాడు

పల్నాడు2
2/6

పల్నాడు

పల్నాడు3
3/6

పల్నాడు

పల్నాడు4
4/6

పల్నాడు

పల్నాడు5
5/6

పల్నాడు

పల్నాడు6
6/6

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement