ఈ సీజన్‌లో ఇదే ప్రథమం | - | Sakshi
Sakshi News home page

ఈ సీజన్‌లో ఇదే ప్రథమం

Published Fri, Feb 7 2025 1:34 AM | Last Updated on Fri, Feb 7 2025 1:33 AM

ఈ సీజన్‌లో ఇదే ప్రథమం

ఈ సీజన్‌లో ఇదే ప్రథమం

యార్డుకు 1,36,176 బస్తాల మిర్చి

మొత్తం 1,33,436 బస్తాల అమ్మకం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం భారీ స్థాయిలో ఈ సీజన్‌లో ప్రథమంగా 1,36,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,33,436 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. ఏసీ కామన్‌ రకం రూ.9,500 నుంచి రూ.13,200 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 74,902 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement