సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వాలి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి అధికారులను ఆదేశించా రు. గురువారం అమరేశ్వరాలయంలో నిర్వహించి న మహాశివరాత్రి ఉత్సవాల మొదటి సమన్వయకమిటీ సమావేశంలో ఆయన వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 26వ తేదీ మహాశివరాత్రి, 27వ తేదీ రథత్సవం ఉంటుందని, భక్తులు అమరావతి చేరుకోవటానికి గుంటూరు నుంచి ప్రతి 10నిముషాలకు ఒక బస్‌సర్వీస్, సత్తెనపల్లి, విజయవాడ డిపోల నుంచి అవసరమైన బస్సు సర్వీస్‌లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉత్సవాలలో శాంతి భద్రతలను కాపాడటం కోసం సుమారు 200 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు స్థానిక సీఐ అచ్చియ్య తెలిపారు. దేవాలయంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తామని, అత్యవసర సమయంలో ఇబ్బంది లేకుండా 60 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దేవాలయంలో పారిశుద్ధ్య నిర్వహణకు మూడు షిప్టులలో 80 మంది ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నామని, దుస్తులు మార్చుకునేందుకుగాను కృష్ణానది ఒడ్డున 10 తాత్కాలిక గదులను ఏర్పాటు చేస్తున్నామని దేవాలయ ఈఓ సునీల్‌కుమార్ తెలిపారు. ప్రమాదాలు జరగుకుండా నదిలో పడవలను ఏర్పాటు చేసి వాటిపై గజ ఈతగాళ్లను నియమిస్తామని మత్య్సశాఖ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఎకై ్సజ్ శాఖ డ్రై డేలను అమలు చేస్తామని ఎకై ్సజ్ శాఖ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆర్డీఓ మాట్లాడుతూ దేవాలయ అధికారులతో మిగిలిన అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని అన్నారు. ఉత్సవాల రెండురోజులు దేవాదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ అధికారితో కలసి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బి.రవి, తహసీల్దార్ డానియేల్‌తోపాటు వివిధశాఖల మండల స్థాయి అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంతరెడ్డి
మహా శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment