కొనే నాథుడే కరువయ్యాడు...
నేను నాలుగు ఎకరాలలో కంది పంట సాగు చేశాను. ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట అమ్ముకుందామంటే కొనేవారు ఎవరు ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి కూడా బాగా తగ్గింది. గత సంవత్సరం క్వింటా కంది రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు సాగు చేశాను. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ మా గోడు పట్టించుకో లేదు. ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం మద్దతు ధర రూ.7,550కు కందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
–ఉప్పు శ్రీనివాసరావు, దుర్గి.
Comments
Please login to add a commentAdd a comment