చిట్ ఫండ్ యాజమానికి 14 రోజుల రిమాండ్
గుంటూరు జిల్లా కారాగారానికి తరలింపు
నగరంపాలెం: నరసరావుపేట పట్టణంలోని సాయిసాధన చిట్ ఫండ్ సంస్థ యాజమాని పాలడుగు పుల్లారావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిపై పల్నాడు జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 43 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేయగా, మోసపోయిన జాబితాలో మరి కొంత మంది ఉన్నారు. బాధితులకు సుమారు పది కోట్ల రూపాయలకు పైగా మోసగించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వస్తున్నారని, ఎన్ని కోట్ల రూపాయలకు మోసగించారనేది మరో పది రోజుల్లో తేలనుందని తెలిపారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతను గురువారం జిల్లా కోర్టుకు వచ్చారు. గుంటూరు ఎకై ్సజ్ కోర్టులో హాజరైన పుల్లారావుకు 14 రోజుల రిమాండ్‌ను ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి స్పందన విధించారు. అనంతరం పుల్లారావును గుంటూరు నగరంలోని జిల్లా కారాగారానికి తరలించారు.
విజయకీలాద్రిపై
శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు
తాడేపల్లిరూరల్: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గురువారం సకల విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ హోమాన్ని, హనుమద్వాహన సేవ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయకీలాద్రి దివ్య క్షేత్ర 8వ వార్షిక బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఉదయం 8.30 గంటలకు హయ గ్రీవ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను, సాయంత్రం శ్రీనివాసునికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేద విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment