ప్రథమస్థానంలో బాపట్ల, ప్రకాశం జిల్లాల కంబైండ్ గిత్తలు
హోరాహోరీగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 175 వజ్రోత్సవ తిరుణాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లుగా పోటాపోటీగా జరిగాయి. జూనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి, ప్రకాశం జిల్లా కాజీపేట గ్రామానికి చెందిన వి.ఓసురారెడ్డి కంబైండ్ గిత్తలు 2,734 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ.80 వేలను కై వసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన డి.రోహన్‌బాబుకు చెందిన గిత్తలు 2,700 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 65 వేలను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరి గ్రామానికి చెందిన పి.శివకృష్ణకు చెందిన గిత్తలు 2,478.10 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ.45 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఎ.శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి గిత్తలు 2,117 అడుగులు లాగి 6వ బహుమతి రూ. 20 వేలను దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా లింగాయిపాలెం గ్రామానికి చెందిన యల్లం సాంబశివరావు గిత్తలు 2,075.8 అడుగులతో 8వ బహుమతి రూ. 10 వేలను దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా నాగులపాడు గ్రామానికి చెందిన పి. శ్రీనివాసరావు గిత్తలు 1,918.5 అడుగులు లాగి 9వ బహుమతి రూ. 9 వేలను గెలుచుకున్నాయి. పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామానికి చెందిన వై. సుబ్బయ్య గిత్తలు 1,888.3 అడుగులు లాగి 10 వ బహుమతి రూ. 8,888 దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన పి.ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ కంభైండ్ గిత్తలు 1,290.7 అడుగులు లాగి 11వ బహుమతి రూ. 7,777 వేలను దక్కించుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 12 జతలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment