వేంకటేశ్వర స్వామి ఆలయంలో విధ్వంసం
క్రోసూరు: వేంకటేశ్వర స్వామి ఆలయంలో దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు –సత్తెనపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఈ దారుణం జరిగింది. నామాల విగ్రహాన్ని కూలదోసి, దేవతా విగ్రహాలను విసిరివేసి తోరణాల ఆకులతో మంట పెట్టారు. శనివారం ఉదయం సమాచారం తెలుసుకున్న గ్రామ ప్రజలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఘటనకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి సర్దిచెప్పారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. స్థానికంగా ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమమని, భవిష్యత్తులో ఈ తరహా దుశ్చర్యలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శన
సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, డీఎస్పీ ఎం. హనుమంతరావులు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. పూర్తి వివరాలు సేకరించారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులను పట్టుకుంటామని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట సత్తెనపల్లి రూరల్ సీఐ పి.శ్రీనివాసరావు, క్రోసూరు సీఐ పి.సురేష్, క్రోసూరు ఎస్‌ఐ నాగేంద్రరావు, అమరావతి ఎస్‌ఐ అమీర్, బెల్లంకొండ ఎస్‌ఐ ప్రవీణ్, పెదకూరపాడు ఎస్‌ఐ అల్లూరురెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
నామాల విగ్రహం పడేసిన దుండగులు
చిన్న విగ్రహాలు, శివలింగం
విసిరేసిన వైనం
తోరణాలను దహనం చేసి
మరీ విధ్వంసం
విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు,
భక్తుల ఆందోళన
ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment