లారీ ఢీకొని మిర్చి కమీషన్ వ్యాపారి మృతి
కారెంపూడి: లారీ ఢీకొని మిర్చి కమీషన్ వ్యాపారి మృతి చెందిన ఘటన మండలంలోని ఒప్పిచర్ల గ్రామ పెట్రోలు బంకు వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గురజాల వైపు నుంచి కారెంపూడి బైక్‌పై వస్తుండగా పెట్రోలు బంకు వద్ద ఘటన జరిగింది. ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన ఆళ్ల అనిల్‌కుమార్ (24) కమీషన్ వ్యాపారి. బైక్‌పై వస్తుండగా బంకు వద్ద ఆగి ఉన్న కారు డోరు తీయడంతో డోరుకు తగిలి రోడ్డుపై పడ్డాడు. ఇంతలో అటుగా వచ్చిన లారీ ఢీకొని అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ టీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
మాచవరం: వసతులు లేని హాస్టల్‌కు వెళ్లాలనే బాధతో ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని మోర్జంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన విద్యార్థిని షేక్ గుల్జార్ (19) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. సరైన సౌకర్యాలు లేని కళాశాల వసతి గృహానికి మళ్లీ వెళ్లాల్సి వస్తోందనే బాధతో డిసెంబర్ 23వ తేదీన ఎలుకల మందు నీటిలో కలుపుకొని తాగింది. చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల, గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. విద్యార్థిని తండ్రి ఇబ్రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment