No Headline
జియ్యమ్మవలస మండలం డంగభద్ర, ఇతర ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని కళ్లం వద్దే స్థానిక మిల్లర్లు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. ప్రభుత్వం క్వింటా ధర రూ.2,300 ప్రకటిస్తే.. మండలంలో రూ.1,800 చెల్లిస్తున్నారు. బస్తా వద్ద రూ.500 వరకు నష్టపోతున్నారు. దీనికితోడు తూకంలో మరో ఐదు కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారు. మొత్తం కలిపి ఒక బస్తా వద్ద రూ.600 దాటి నష్టపోతున్నారని.. ఈ లెక్కన వంద బస్తాలు పండించే రైతుకు రూ.60 వేల మేర నష్టం వస్తోందని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూరంగి సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సీతానగరం, బలిజిపేట, పాలకొండ, వీరఘట్టం తదితర ప్రాంతాల్లోనూ కొనుగోలు కేంద్రాలు లేక, రైతులు పండించిన పంటను దళారులు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment