ఆకట్టుకున్న వర్ణచిత్రం
గరుగుబిల్లి: దేశభక్తిని ప్రభోదించే జాతీయ జెండాలో భారతమాత వర్ణచిత్రం పలువురిని ఆకట్టుకొంది. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని మండలంలోని నాగూరుకు చెందిన ప్రముఖ నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు వేసిన వర్ణచిత్రం పలువురు దేశభక్తి ప్రియులను ఆకర్షించింది. ఈయన ప్రత్యేక దినాలలో నఖచిత్రాలు, వర్ణచిత్రాలను వేస్తుంటారు.
కిచ్చాడలో ఏనుగుల గుంపు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామ పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. దీంతో గ్రామాల్లోకి చొరబడతాయేమోనని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
క్రీడా మైదానానికి శంకుస్థాపన
పూసపాటిరేగ : మండలంలోని కొవ్వాడ గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణానికి సర్పంచ్ కోట్ల రామునాయుడు ఆదివారం శంకుస్థాపన చేసారు. తమ సొంత నిధులు రూ.25 లక్షలతో మైదానానికి వివిధ రకాలు పనుల నిమిత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 20 అడుగుల లోతులో వున్న గోతులను కప్పి మైదానం పనులు చేస్తున్నట్లు తెలిపారు. లోతును పూడ్చడానికి సుమారు 3 వేలు లోడులు మట్టితో నింపడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలియజేసారు. కొవ్వాడ గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణం గ్రామస్తులు కలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దేబార్కి అప్పారావు, ఉప సర్పంచ్ బండి నర్సయ్యతో వార్డు సభ్యులు, కల్యాణపు హరిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫోర్ లైన్స్ రహదారి
ఏర్పాటుకు చర్యలు
రామభద్రపురం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి వయా రాజాం, బాడంగి, రామభద్రపురం, పార్వతీపురం మీదుగా రాయఘడ వరకు ఫోర్ లైన్స్ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు నుంచి రాజాం వైపు రహదారిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల నుంచి రామతీర్ధం మీదుగా రణస్థలం వరకు విస్తరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణా సౌకర్యం కల్పనే లక్ష్యంగా రహదారులు విస్తరణ చేయనుందని తెలిపారు. రహదారులు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కారీకి విన్నవించగా ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫీజుబిల్టీ కూడా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో కొన్నింటిని అమలు చేస్తోందని, మిగిలిన పఽథకాల అమలుపై దృష్టి సారిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment