–8లో
ఉత్తరాంధ్ర అభివృద్ధికి
రూ.50 వేల కోట్లు కేటాయించాలి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి. సూర్యనారాయణ కోరారు.
గురువుల ఎన్నికల సందడి
గురువుల సమస్యలపై పోరాడేందుకు ఎన్నుకోవాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది.
కనీస పింఛన్ రూ.9వేలు చెల్లించాలి
పెన్షనర్లకు కనీస ఫించన్ రూ.9వేలు చెల్లించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు డిమాండ్ చేశారు.
బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025
శంబర పోలమాంబ సిరిమానోత్సవం
దారులన్నీ జన సంద్రమే.. ఎటువైపు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. దిక్కులు పిక్కటిల్లేలా
అమ్మ శరణు ఘోష ఓ వైపు.. సాక్షీభూతంగా నిలిచిన గోముఖీ నది సవ్వడులు మరోవైపు లయబద్ధంగా
సాగుతుంటే.. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. గిరిజనుల
కొంగు బంగారం పోలమాంబ 36 అడుగుల సిరిమానుపై ఠీవీగా ఆసీనులై, పురవీధుల్లో ఊరేగింది.
తన చల్లని చూపుతో భక్తులకు ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి మురిసిపోయింది. ఆనందంతో పులకించిపోయింది.
● అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎండలోనే క్యూకట్టారు.
● కలెక్టర్ ఎం.శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ దిలీప్‌కిరణ్, ఏఎస్పీ అంకితసురాన దగ్గరుండి జాతర బందోబస్తును పర్యవేక్షించారు.
● సిరిమాను వద్ద వేషధారణలు ఆక్టుకున్నాయి.
● మధ్యాహ్నం 2.50 నిమిషాలకు గిరిడ వారింటికి అమ్మవారి ఘటాలు చేరుకున్నాయి.
● మధ్యాహ్నం 3.10 నిమిషాలుకు సిరిమాను ప్రదేశానికి చేరుకున్న పూజారి జన్ని పేకాపు రామారావు
● 3.30 నిమిషాలుకు సిరిమానోత్సవం కార్యక్రమం ప్రారంభం. 5.10కి ముగింపు
● గతేడాది కంటే 50 నిమిషాలు ముందుగా బయల్దేరిన సిరిమానోత్సవం
● అధికారుల సమన్వయంతో సజావుగా పోలమాంబ అమ్మవారి జాతర
● భక్తులకు తాగునీరు అందించిన శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు
● శ్రీసూర్య డవలపర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ, పులిహోరా పంపిణీ
● డ్రోన్ కెమెరాలతో జాతర పర్యవేక్షణ
● పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్
● సిరిమాను వెంట పురవీధుల్లో పర్యటించిన అడిషనల్‌ఎస్పీ దిలీప్‌కిరణ్
● భక్తజన ‘శంబర’ం
● కనుల పండువగా పోలమాంబ
సిరిమానోత్సవం
● తరలివచ్చిన లక్షలాదిమంది భక్తులు
● భక్తుల జయజయధ్వానాల నడుమ
పురవీధుల్లో ఊరేగిన వనదేవత
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/సాలూరు:
గిరిజనుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం కనులపండువగా సాగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో కొలువైన పోలమాంబ జాతరకు ఉమ్మడి విజయనగరం జిల్లాతోపాటు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమ, మంగళవారాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పసుపుకుంకుమలు, చీరలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సంబరంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. పూజారి జన్నిపేకాపు రామారావు మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సిరిమానును అధిరోహించారు. తొలుత గిరడ వారి ఇంటి వద్ద పూజలు అందుకున్న అనంతరం.. సావిడి వీధిలోని మునసబు ఇంటి వద్ద పసుపు కుంకుమలు అందుకుని సిరిమాను ముందుకు సాగింది. ప్రధాన రహదారి మీదుగా ఎస్సీ కాలనీ, పనుకువీధి, గొల్లవీధి నుంచి తిరిగి సావిడివీధికి చేరుకుంది. అనంతరం అమ్మవారి ఘటాలను గద్దె వద్ద ఉంచడంతో సిరిమాను ఘట్టం ముగిసింది.
● పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
పోలమాంబ పండగను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
● అంపకోత్సవం రోజున గ్రామంలోకి పోలమాంబ
శంబర పోలమాంబ జాతరలో సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 4న మారు జాతర నిర్వహిస్తారు. తర్వాత ఎనిమిది వారాల పాటు జాతర కొనసాగుతుంది. అప్పటి వరకూ ప్రతి మంగళవారం భక్తులు తల్లి దర్శనానికి వస్తూ ఉంటారు.
● పటిష్ట బందోబస్తు
సిరిమాను సంబరాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి, అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలమాంబను దర్శించుకున్న ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సిరిమాను ఆద్యంతం అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్, సబ్ డివిజన్ ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి సిరిమాను వెంబడి ఉండి బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. పోలీస్ సేవాదళ్ సభ్యులు దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు కలగకుండా సేవలందించారు. అందరి సహకారంతో అమ్మవారి సిరిమానోత్సవం ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు.
● స్వల్ప ఘటనలు
సిరిమాను సంబరానికి ముందు తల్లి సేవకురాలిపై పిట్టగోడ కూలింది. దీంతో స్వల్ప గాయాలపాలైన ఆమెను ఫీడర్ అంబులెన్స్‌లో తరలించి చికిత్స అందించారు. మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ పూడి దాలినాయుడుకు భక్తులు విసిరిన కొబ్బరి చిప్ప తగలడంతో స్వల్ప గాయమైంది.
● సిరిమానోత్సవం సమయంలో పారిశుద్ధ్య చర్యలు అంతంత మాత్రం గానే కానవచ్చాయి. రథం తిరుగుతున్న సమయంలో భక్తులు అరటిపండ్లు విసరడం ఆనవాయితీ. గతంలో వెనువెంటనే వీటిని శుభ్రపరిచేవారు. ఈసారి సకాలంలో స్పందించకపోవడంతో, అరటి పండ్ల మీద కాలు వేసి, చాలామంది భక్తులు జారిపడ్డారు.
● జాతరలో పెద్ద ఎత్తున తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. ఈ క్రమంలో తమ నుంచి కొంతమంది ఆశీల రూపంలో దౌర్జన్యంగా నగదు వసూలు చేశారని పలువురు వ్యాపారులు వాపోయారు.
● ముగిసిన ఉత్సవం: సిరిమాను ఉత్సవం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. తిరిగి సాయంత్రం 5.10 నిమిషాల సమయంలో గద్దె వద్దకు ఘటాలు చేరుకోవడంతో సంబరం ముగిసినట్లయింది.
● స్వల్పమైనవి మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
హాస్టల్స్ విద్యార్థులకు ఆరోగ్యకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: హాస్టల్స్‌లో ఆరోగ్యకర వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసించే పరిస్థితులను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలో తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మెలగాల్సిన విద్యార్థుల మధ్య వైరాలు, ఘర్షణలు, దాడులు తదితర అనేక సంఘటనలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణమన్నారు. ఓ వైపు అనారోగ్యాలతో విద్యార్థుల మరణాలు, మరోవైపు ఫీజులు చెల్లించలేక, చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు మరణిస్తున్న హృదయ విదారక సంఘటనలు చూస్తున్నామని వాపోయారు. తాజాగా పట్టణ సమీపంలోని పీఎన్‌బొడ్డవలస గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనపై అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు నిర్వహించి తగుచర్యలు తీసుకోవాలని కోరారు.
కేజీబీవీని సందర్శించిన డీడీ
సీతంపేట: స్థానిక కేజీబీవీ పాఠశాలను గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర మంగళవారం సందర్శించారు. పప్పు, కూరను మరింత రుచికరంగా వండాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆయన వెంట ఏఎంఓ పి.కోటిబాబు ఉన్నారు.
కుష్ఠు వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించాలి
● రాష్ట్ర కుష్ఠు నివారణశాఖ జేడీ సాగర్
విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించాలని రాష్ట్ర కుష్ఠు నివారణశాఖ జేడీ డాక్టర్ సాగర్ వైద్య సిబ్బందికి సూచించారు. విజయనగరం సర్వజన ఆస్పత్రి డెర్మటాలజీ విభాగం వైద్యులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. స్పర్శ, నొప్పిలేని మచ్చలను కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ అర్చన, డాక్టర్ పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
● రాళ్లు తేలిన సిరిమాను మార్గం..
సిరిమాను తిరిగే మార్గంలో హడావిడిగా రహదారి పనులు చేపట్టారు. జాతరకు మూడు రోజులు ముందే పనులు ప్రారంభించడం.. అవి కూడా ఉమ్ముతడిగా మమ అనిపించడంతో మొత్తం రాళ్లు తేలి నడిచేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడ్డారు. సిరిమాను తిరిగే పనుకువీధి మార్గంలో పెద్ద పెద్ద రాళ్లు బయటకు వచ్చాయి. దీంతో రథం తిరగడానికి కాస్త ఆటంకం కలిగింది.
● ఏర్పాట్లను పరిశీలించిన పీఓ
పోలమాంబ జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ లేకుండా చూడాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలమాంబ సిరిమాను పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. మంగళ, బుధవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా రానూపోను రవాణా, భక్తుల దర్శనార్థం క్యూలు ఏర్పాటుచేయాలన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్నానపు గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
విజయనగరం క్రైమ్: గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యమని, గంజాయి క్రయవిక్రయదారులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎమ్‌డీ సీహెచ్ ద్వారక తిరుమలరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ వకుల్ జిందల్, కమాండెంట్ మాలిక గార్గ్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్‌శాఖ చేపట్టిన చర్యలపై సమీక్షించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ఎస్పీ వకుల్ జిందల్ చేపట్టిన సంకల్పం కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి, జిల్లా పోలీస్ శాఖకు, రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలన్నారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని, అవి నేడు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, వివిధ నేరాలను ఛేదించడంలో పోలీసుల కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీకి ఎస్పీ వకుల్‌జిందల్ వివరించారు. అనంతరం డీజీపీని దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో విశాఖరేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు
జిల్లా పోలీసులు జమ్ము కశ్మీర్ వెళ్లి డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను అరెస్టు చేసి, కేసును ఛేదించడం, రూ.20 లక్షల నగదును రికవరీ చేయడం, మరింత నగదును నిందితుడి బ్యాంకు ఖాతాలో ప్రీజ్ చేయడాన్ని డీజీపీ అభినందించారు. సీఐలకు త్వరలో డీఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తామ ని తెలిపారు. గంజాయి నియంత్రణకు ఈగల్ అనే విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశామని, కింగ్ పిన్స్, గ్యాంగ్‌స్టర్స్‌ను అరెస్టు చేసి గంజా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. సమావేశంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న
రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు
జాతర సైడ్‌లైట్స్
లక్షల్లో తరలి వచ్చిన భక్తులు
ఏటా జనవరి చివరివారంలో జరిగే పోలమాంబ జాతర వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా తరలివచ్చారని అంచనా. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను తమ ఇంటి ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంటుంది. అందువల్లే పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోకి తీసుకువస్తారు. పండగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి, ఆ తరువాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం కొనసాగింపుగా వస్తోంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా అమ్మ జాతర భక్త జన సంద్రంగా మారింది. ఆర్టీసీ 130 ప్రత్యేక బస్సులను నడిపింది. రాకపోకలకు భక్తులు ఇబ్బందులు పడకుండా సేవలందించింది.
కిక్కిరిసిన క్యూలు
పోలమాంబ అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. 10 గంటల సమయానికి క్యూలు నిండిపోయాయి. నీడ కోసం ఏర్పాటు చేసిన పెండాల్స్ చాలక.. ఎండలోనే భక్తులు అవస్థలు పడ్డారు. గంటలకొద్దీ లైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. గోముఖి నదిలో స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకుని కోళ్లు, పోతులు, చీర, పసుపుకుంకుమ సమర్పించి అమ్మవారికి ప్రణమిల్లారు. ప్రధాన గుడిలోపలికి వెళ్లలేకపోయిన భక్తులు.. వనం గుడి వద్దకు వెళ్లి, పెద పోలమాంబను దర్శించుకుని, వేప చెట్టుకు పూజలు చేసి, అక్కడ నుంచే మొక్కలు చెల్లించుకుని వెనుదిరిగారు. దేవస్థానం అధికారులు ఉచిత దర్శనంతో పాటు, రూ.20, రూ.100 టికెట్లతో ప్రత్యేక దర్శనం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment