కనీస పింఛన్ రూ.9వేలు చెల్లించాలి
విజయనగరం పూల్‌బాగ్: పెన్షనర్లకు కనీస ఫించన్ రూ.9వేలు చెల్లించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కేఎల్‌పురంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆల్‌పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన 11 సంవత్సరాల కాలంగా ఎన్ని పోరాటాలు చేసిన ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 36లక్షల మంది కనీస పెన్షన్ వెయ్యిరూపాయలు పొందలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అదేవిధంగా హయ్యర్ పెన్షన్ కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేస్తే నేటికీ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించి, వారందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లరు ఫిబ్రవరి1వ తేదీన ప్రకటించే బడ్జెట్‌లో కనీస పెన్షన్ రూ.9వేలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఫిబ్రవరి 11,12,13, తేదీల్లో ఢిల్లీలో పోరాట కార్యక్రమం నిర్వహించనున్నామని, మార్చిలో రైల్‌రోకోలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ పాల్గొని ప్రసంగించారు. కేపీ కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ఎ.గౌరినాయుడు, కె.రామారావు, వి. శేషగిరి, జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment