
సైబర్ మోసం..!
కానిస్టేబుల్‌నని చెప్పి..
వీరఘట్టం: హలో.. నేను వీరఘట్టం కానిస్టేబుల్‌ను. ఎస్సై గారు హాస్పిటల్‌లో ఉన్నారు. అర్జెంట్‌గా రూ.55 వేలు కావాలి. నా వద్ద క్యాష్ ఉంది. మీరు ఫోన్‌పే చేస్తే క్యాష్ ఇచ్చేస్తానని నమ్మబలికాడో సైబర్ కేటుగాడు. అర్జెంట్ అంటూ పదేపదే ఫోన్ చేయడంతో అతను చెప్పింది నిజమేనని నమ్మిన వీరఘట్టానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి సోమవారం రూ.28 వేలు ఫోన్‌పే చేశాడు. ఫోన్‌పే కొట్టిన పది నిమిషాల్లో అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయ్యింది. దీంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీస్తే అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని తేలింది. అంతేకాకుండా ఎస్సై కళాధర్ విధుల్లో ఉన్నారు. దీంతో తాను మోసపోయానని ప్రతాప్‌కు అర్థమైంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్..
వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురానికి చెందిన 469 వ్యాపారులు,ఇతర ఉద్యోగులు, సామాన్యులు అందరూ కలిసి ‘వి.జి.టి.యం నీడ్ మనీ ట్రాన్స్‌ఫర్స్ వీరఘట్టం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు.ఎవరికై నా డబ్బులు కావాలన్నా, ఫోన్ పే కావాలన్నా ఒకరికొకరు పరిచయస్తులు కావడంతో సులువుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఏడాది కాలంగా ఈ గ్రూప్ నడుస్తోంది.ఈ గ్రూప్‌లో మెసేజ్ రావడంతో ఇదే గ్రూపులో ఉన్న ప్రతాప్ అవతల వ్యక్తిని నమ్మి మోసపోయాడు. ఈ వాట్సాప్ గ్రూప్ నా కొంప ముంచిందంటూ లబోదిబోమంటున్నాడు.
స్విచాఫ్ అయిన నంబర్..
ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 7569341175 నంబర్ వివరాలు ఆరా తీయగా ఈ నంబర్ మోశ్యా శ్రీరామ్ అనే పేరు మీద ఉంది.అడ్రస్‌ను పరిశీలించగా సన్ ఆఫ్ మోశ్యా బలరాం బేటా, తాజంగి, చింతపల్లి, విశాఖపట్నం–531116 అని ఉంది. ఆ ఫోన్ నంబర్ మాత్రం స్విచాఫ్ వస్తోంది. విజ్జత గల వ్యాపారులు ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హితవు పలుకుతున్నారు.
రూ.28 వేలు ఫోన్‌పే చేసిన బాధితుడు
లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

సైబర్ మోసం..!