ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా.. | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..

Published Tue, May 7 2024 1:20 AM

ఓదెల

పెద్దపల్లిరూరల్‌: ‘భారత్‌ మాతాకీ జై.. అందరికీ నమస్కార్‌.. ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా’ అ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌(జేపీ) న డ్డా జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ఆరంభించారు. ప్రధాని మోదీ సా రథ్యంలోని ప్రభుత్వం నీతివంతమైన పాలన సాగిస్తోందని, మనదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగాన ని లిపేందుకే ఆరాట పడుతోందన్నారు. స్థానిక ప్రభు త్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో పెద్దపల్లి పార్ల మెంట్‌ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతు గా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నడ్డా ప్రసంగాన్ని రాంచందర్‌రావు తె లుగులో అనువదించారు. మంథని ఎమ్మెల్యేగా ఎ న్నికైన, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భార తరత్న పురస్కారం అందించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు అన్నిగ్రామాలకు చేరాయన్నారు. 53వ నంబరు జాతీయ రహదారి పూర్తయితే మరింత మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ సాగుతోందని, రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభించామని తెలిపారు. 25కోట్ల మంది పేదలు ఆత్మ నిర్భర్‌ ద్వారా ఆర్థికాభ్యున్నతి సాధించేలా ప్రోత్సహించామన్నారు. పదేళ్ల కేసీఆర్‌ సర్కార్‌ విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని, కుటుంబపాలనకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. పేదలకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కేంద్రప్రభుత్వం ప్రధాని ఆవాస్‌ యోజన కింద 4కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు.

ఓవైసీతో దోస్తానా..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఓవైసీతో దోస్తీ చేస్తున్నా రని జేపీ నడ్డా విమర్శించారు. ముస్లింల ఓట్ల కోస మే ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు పంచారని, తాము వాటినే రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

పెద్దపల్లి వివేక్‌ కుటుంబం జాగీరా?

‘పెద్దపల్లి అడ్డా వెంకటస్వామి కుటుంబీకుల జాగీ రా? వెంకటస్వామి పోతే ఆయన కొడుకు వివేక్‌, ఇ పుడు ఈయన కొడుకు వంశీకృష్ణ పోటీ చేస్తరా? ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తం.. గడ్డం కుటుంబీకుల ను ఓడించి కాషాయజెండా ఎగురవేస్తం’ అని బీజే పీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ అన్నారు. ఇక్క డ ప్రజాప్రతినిధులుగా గెలిచి ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ వెంకటేశ్‌ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత్‌ భా రత్‌ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన రిజర్వేషన్లు ఒక్క వెంకటస్వామి కుటుంబమే అనుభవిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల బీజేపీ అధ్యక్షులు సునీల్‌రెడ్డి, రఘునాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి, శ్రీదేవి, నాయకులు చిలారపు పర్వతాలు, జి.సురేశ్‌రెడ్డి, వనిత, కందుల సంధ్యారాణి, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు.

భారత్‌ మాతాకీ జై.. అందరికీ నమస్కార్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
1/2

ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..

ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
2/2

ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..

Advertisement
 
Advertisement