
‘ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉ ప్పు రాజ్‌కుమార్ విమర్శించారు. ఆరుగ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంటూ స్థానిక బస్టాండ్ వ ద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో అధికా రం దక్కించుకోవాలనే ఆరాటంతో అడ్డగోలు హామీలు ఇచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాయకులు సంపత్, మోహన్‌రావు, రాములు, చంద్రశేఖర్, భిక్షప తి, ఖదీర్‌ఖాన్, కార్తీక్, సురేశ్, వైద శ్రీనివాస్, మధు, అఖిల్, లక్ష్మణ్, ఫహీం, వాహిద్, అరుణ్, నరేశ్, ప్రేంకుమార్, ఆకుల శ్రీనివాస్, వే ణుగోపాలరావు, లవన్‌కుమార్ ఉన్నారు.