
ఏపీలో ఎన్నికల వాతవరణం చెడగొట్టేందుకు టీడీపీ శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయి.
హైదరాబాద్, సాక్షి: ఓటమి భయంతో ఏపీలో ఎన్నికల వాతవరణం చెడగొట్టేందుకు టీడీపీ శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే.. పోలింగ్ సెంటర్‌ల వద్దకు చేరుకుని దాడులకు తెగపడుతున్నాయి.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యకాండకు దిగారు. నారావారిపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి.
ఇక.. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కోగట్టం గ్రామంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి. టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి దౌర్జన్యానికి దిగారు.
మరోవైపు.. పల్నాడు మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రెంటాల గ్రామంలో దౌర్జన్యానికి దిగారు టీడీపీ బూత్ ఏజెంట్లు.