AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Politics And Election Live Updates May 2nd | Sakshi
Sakshi News home page

AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Thu, May 2 2024 7:53 AM | Last Updated on Thu, May 2 2024 5:25 PM

AP Politics And Election Live Updates May 2nd

Andhra Pradesh Election Updates 2nd May..

 

ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌
5:24 PM, May 2nd, 2024
 

  • రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారు
  • పురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137
  • దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
  • మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు 
  • సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి
  • కొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలు
  • ఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్
  • రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం
  • 14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్
  • ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు
  • 85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారు
  • హైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\
  • విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయి
    తిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయి
  • ఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాం
  • రాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారు
  • పోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాం
  • పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాం
  • బ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాం
  • పెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేను
  • నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది
  • అలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాం
  • ప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు
  • గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు
  • ఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి
  • మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాం
  • అలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాం
  • ఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం
  • ఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాం
  • అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం
  • మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం
  • ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి
  • అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాం
  • రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారు
  • జనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదు
  • అలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వం
  • ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం
  • ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాం
  • పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం

 

చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి
4:43 PM, May 2nd, 2024
 

  • చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసు
  • వైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోంది
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం
  • కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం
  • జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారు
  • ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు
  • గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు
  • నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు
  • కానీ అర్హత ఏంటో చెప్పలేదు
  • అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?
  • 1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు
  • కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు
  • చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు
  • అదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు
  • వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు
  • ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు
  • చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు
  • బ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది
  • చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది
  • వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే
  • వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు
  • 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది
  • అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు
  • కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?
  • అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?
  • సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?
  • చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది
  • అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు
  • ఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది
  • ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే
  • తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు
  • చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం
  • ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి
  • బీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
  • చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?
  • దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి


జనసేనకు ఈసీ ఝలక్‌
1:45 PM, May 2nd, 2024

  • ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. 
  • ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 
  • ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.
  • గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు
  • ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. 
  • ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. 
  • అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
  • ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.
  • జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. 
  • ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 
  • ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. 
  • అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది. 

 

బాబుపై అన్నా రాంబాబు ఫైర్‌
12:30 PM, May 2nd, 2024

  • ప్రకాశం జిల్లా
  • చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్
  • ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడు
  • అసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు
  • చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.
  • 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.
  • చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
     

 

టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్‌ కుమార్‌

11:30 AM, May 2nd, 2024

  • పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్
  • అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
  • కైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..
  • ప్రజలంతా సీఎం జగన్‌ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారు
  • ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారు
  • టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం
  • జగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజం
  • అబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు
  • చంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదు
  • కలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారు
  • పామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాం
  • మరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తా
  • పామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం
     

‘జగన్‌ కోసం సిద్ధం’
11:00 AM, May 2nd, 2024

  • మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ
  • "జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమం
  • నేడు ప్రారంభించనున్న పార్టీ నేతలు
  • మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధం
  • పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో
     

టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌
10:00 AM, May 2nd, 2024

  • 12వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాము
  • స్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసింది
  • డివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాము
  • ప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారు
  • జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?
  • స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవు
  • తూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.
  • ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కింది
  • రెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?
  • రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలు
  • కాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా
  • ప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం
  • ప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారు
  • ఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు
     

 

నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..
9:30 AM, May 2nd, 2024

  • ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులు
  • హోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటు
  • గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటు
  • పామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటు
  • మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటు
  • ఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారు
  • హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  
  • రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  
  • నేటి నుంచి మే 6 వరకూ ఒకసారి
  • మే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం

 

మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..
8:20 AM, May 2nd, 2024

  • అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానం
  • ఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులు
  • మోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు
  • మోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానం
  • మహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులు
  • తనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్
  • చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్
  • జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్
  • తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్
  • ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్
  • రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
     

మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో
7:45 AM, May 2nd, 2024

  • వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌

  • పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు

  • 123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి

  • రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా

  • రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం

  • కాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయం

  • ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటు

  • రూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపు

  • ఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలు

  • ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం

 

‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల
7:20 AM, May 2nd, 2024

  • నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వల

  • జాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారం

  • కరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ 

  • ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. 

  • అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదు

  • ప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్న

  • ఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపు

  • అయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకం

  • నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటన

  • సవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హత

  • కానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల 

  • చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు

  • 1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబు

  • ఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు

  • బాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు

 

వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
7:00 AM, May 2nd, 2024

  • పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణ

  • చంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండా

  • ఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనం
  • పాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకు
  • ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపు
  • పాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీ
  • పోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిల
  • వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి 

 

పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు..
 6:30 AM, May 2nd, 2024

  • చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలు
  • బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులు
  • వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్
  • ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వం
  • డబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలు
  • నిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతి
  • గత నెలలో 39 మంది వృద్దులు మృతి
  • ఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement