ఢిల్లీ: వచ్చే సార్వతిక ఎన్నికలకు సెమీస్‌గా సాగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్‌లో ప్రభావం చూపని ఆ పార్టీ.. పంజాబ్‌లో అధికారం పోగొట్టుకుంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో మళ్లీ బీజేపీ పాగావేసింది. యూపీలో కాంగ్రెస్ అడ్రస్‌లేకుండా పోయింది. ప్రియాంకగాంధీ కూడా కాంగ్రెస్ హస్తవాసిని మార్చలేకపోయింది. సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ఫలితం కనిపించలేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ప్రధానంగా పంజాబ్ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది. సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండు అంచనాలూ ఘోరంగా విఫలం అయ్యాయి.
ఉత్తరప్రదేశ్..
యూపీలో కాంగ్రెస్‌కు ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. అతిపెద్ద రాష్ట్రంలో పొతులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం, ప్రియాంకగాంధీ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోకపోవడం బలమైన నేతలు లేకపోవడం, అతి విశ్వాసం, జాతీయస్థాయిలోనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ బలహీనపడటం, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోవడం, ఎన్నికల్లో కర్షక హామీలు ఇవ్వలేకపోవడం వంటి కారణాలు చెప్పవచ్చు.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. రూ.500 గ్యాస్ సిలిండర్ హామీ, పేదలకు రూ.40వేల పథకం ఓటర్లను ఆకర్షించలే ఆకట్టుకోని 4 లక్షల ఉద్యోగాల హామీ కూడా ఓటర్లను ఆకట్టుకోలేదు. టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ హామీ ఇవ్వకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్ ఓటమికి ఓటమికి కారణాలుగా విశ్లేషించవచ్చు.
పంజాబ్..
పంజాబ్‌లో కాంగ్రెస్ భంగపాటుకు కారణాలను పరిశీలిస్తే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత.. కాంగ్రెస్ ఓటమికి గల కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టి వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయితే, గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఆప్‌కే పట్టం కట్టారు.
పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయ్యింది. దీంతో పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment