
మంత్రి కొండా సురేఖ ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి కేటీ రామారావు తీరుందని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో పెట్టుబడులు అంటూ వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలన్నీ కూడా బోగస్సేనని ఆరోపించారు.
శుక్రవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగో లుగా లక్షల కోట్లు దోచుకుందని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళితబంధు, మిషన్ భగీ రథ అన్నీ కుంభ కోణాలేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు పనిగట్టుకుని రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment