సాక్షి, గుంటూరు: లోకేష్ ఆధ్వర్యంలోనే వైఎస్ జగన్ ఫొటోలను మార్ఫింగ్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. టీడీపీ సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపోస్టులు పెట్టారని.. టీడీపీపై తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసుల ఇప్పటివరకు స్పందించలేదన్నారు.
వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలేదని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్టుల చేయడంలో అంత్యరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన చేస్తామని అంబటి తెలిపారు.
ఇదీ చదవండి: సెజ్ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment