
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని.. ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇక, వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేయడాన్ని రోజా తీవ్రంగా ఖండించారు.
ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా రోజా ట్విట్టర్లో..‘వినుకొండలో నిన్న మా పార్టీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణం. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని చంద్రబాబు.. అంతే కానీ, ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు!’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వినుకొండలో నిన్న మా పార్టీ కార్యకర్త రషీద్ ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణం.. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని @ncbn గారు ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు!!!#SaveAPFromTDP pic.twitter.com/9Ryk2dFqKP
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 18, 2024
ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను పోస్టులో వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో 31 హత్యలు జరిగినట్టు తెలిపారు. అలాగే, 300 హత్యాయత్నాలు, 1050 దాడులు, దౌర్జన్యాలు జరిగాయని లెక్కలతో సహా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment