చేగొండి హరిరామ జోగయ్య తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్‌కు చిర్రెత్తుకొస్తోంది... ఒకవైపు చూస్తే కులంలో పెద్ద... మరోవైపు సీనియర్ నాయకుడు... అలాంటి మనిషి తరచూ తనను ఇరిటేట్ చేస్తుంటే పవన్ ఏమీ అనలేక.. ఇటు చంద్రబాబు దగ్గర డిమాండ్ చేసే పరిస్థితి లేక.. బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
ముక్కీ మూలిగి పొత్తులో ఓ పాతిక సీట్లు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కు గగనమైపోతోంది..ఇది కూడా ఎక్కడ ఇస్తారన్నది ఖరారు కాలేదు.. కేవలం టిక్కెట్లే ఇస్తారా.. అభ్యర్థులను శాతం చంద్రబాబే సప్లై చేస్తారా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు.. ఈలోపే జోగయ్య మళ్ళీ జోరీగయ్య మాదిరి మారిపోయి లేఖలు రిలీజ్ చేస్తున్నారు కనీసం అరవై సీట్లు ఇవ్వకుండా దేనికోసం పొత్తు.. ఇలాగైతే మా కాపులు .. కాపు యువత.. నాయకులూ ఏమవ్వాలి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు మేమెందుకు పాలికాపులమవ్వాలి.
పాతిక ఇరవై సీట్లకోసం పవన్ ఇంత యాగీ చేసి సినిమా కెరీర్ వదులుకుని జగన్ మీద ఇంతగా రెచ్చిపోయి కాలు దువ్వి శత్రుత్వం తెచ్చుకోవాలా ? ఇదెక్కడి దరిద్రం అంటూ జోగయ్య రాస్తున్న లేఖలు. వాటిలో లేవనెత్తుతున్న సందేహాలు ఇటు కాపు యువతలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. కాపులకు అధికప్రాధాన్యం ఇస్తూ కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలను సైతం ఆడుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాళ్ళదన్నుకుని తెలుగుదేశం పల్లకీ ఎందుకు మోయాలి అనేది ఇప్పుడు గోదావరి జిల్లాల్లోచర్చ. కులం చెడినా సుఖం దక్కాలన్నది సామెత.
కానీ కేవలం పాతిక సీట్ల కోసం మొత్తం కాపులను గంపగుత్తగా చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేస్తే ఎలా అనేది జోగయ్య ప్రశ్న... అరవై సీట్లయినా ఇవ్వకుంటే కాపు నాయకులకు పోటీ చేసేందుకు ఎక్కడ అవకాశం వస్తుందని.. వాళ్లంతా చాన్నాళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం చూస్తున్నారని. ఇప్పుడు పాతిక సీట్లకే ఒప్పేసుకుంటే ఇక వాళ్లంతా ఎందుకు ఊరుకుంటారని..? ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తారని జోగయ్య లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమే అని కాపు యువత అంటోంది.
గౌరవప్రదంగా సీట్లు కేటాయించకుంటే పొత్తు పొసగదని జోగయ్య తేల్చేసారు. దీంతో పవన్ ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారు. ఇటు చూస్తుంటే చంద్రబాబు పాతిక సీట్లకు మించి ఇవ్వడు.. కావాలంటే బ్లాకులో డబ్బు ఇస్తాడు కానీ సీట్లు ఇవ్వడు.. అన్ని లేకపోతె ప్రజలు ఒప్పుకోరు.. దీంతో ఏమి చేయాలో తోచక పవన్ మళ్ళీ కార్యకర్తలకు మొహం చూపలేక సిగ్గుతో దాక్కున్నారు. అలాగని టీడీపీని కాదని అటు బీజేపీతో వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు.. ఏమిటో పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఒక దారీ తెన్నూ లేకుండా జాతరలో దారితప్పిన పిల్లాడిలా పవన్ ఆందోళనలో ఉండిపోయారు
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment