మాజీ మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో రోజువారీ సమస్యలు కూడా తీరడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, బీఆర్‌ఎస్ పార్టీ.. ఈ సర్కారును తట్టి లేపినా నిద్ర లేవట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నా కనీసం రోజువారీ సమస్యలను కూడా రేవంత్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా ముందడుగు వేయడం లేదని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు.
సోమవారం ఆయన బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ఏడాది మార్చికి ముందే పంచాయతీలకు రూ.500 కోట్లు విడుదలైనా కారి్మకులకు కనీసం జీతాలు అందడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం మరో రూ.750 కోట్ల నిధుల విడుదలను నిలిపివేసిందని వెల్లడించారు. ఆసరా పింఛన్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి వేతనాల చెల్లింపులో కూడా తాను ప్రశ్నించిన తర్వాతే కొంత చలనం వచి్చందన్నారు.
రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం రేవంత్ చెప్పినా అమలు కావడం లేదని హరీశ్‌రావు అన్నారు. రూ.లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన వారిలో 30 నుంచి 40 శాతం మందికి లబ్ధి జరగలేదని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ప్రభుత్వ బదిలీల్లో పారదర్శకత లేకఅన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment