బూర్గంపాడు: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు సాధించేలా రాజకీయ పార్టీలు తమాషా రాజకీయాలు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చిన ఆయన శుక్రవారం సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని విమర్శించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టడం గర్హనీయమన్నారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్లు ప్రకటించినా, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును విజయవాడకు బీఆర్‌ఎస్ పంపించగా.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవడం ఓటు బ్యాంకు రాజకీయాలేనన్నారు. చంద్రబాబు అరెస్ట్ సక్రమంగా జరగలేదని తెలంగాణలోని పార్టీల నాయకులు మాట్లాడడం ఒక సామాజికవర్గానికి చెందిన ఓట్ల కోసమేనని కొమ్మినేని తెలిపారు.
చంద్రబాబుకు ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా ఆయన కేసులు ఎదుర్కోవాల్సిందేనని, అవినీతి చేసిన వారికి శిçక్ష పడడం ఖాయమని చెప్పారు. ఖమ్మంజిల్లాతో పాటుగా కొన్నిచోట్ల ఎక్కువగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్ల కోసం చంద్రబాబు అరెస్టు తప్పుపడుతున్న పార్టీలకు, ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే విషయం గుర్తించాలని సూచించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలతో పాటు కమ్యూనిస్టులు గతంలో ఆయనపై చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెలంగాణలోని పార్టీలు ప్రయతి్నంచడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment