TS: KTR Satirical Tweet On Rahul Gandhi Telangana Tour, Goes Viral - Sakshi
Sakshi News home page

KTR-Rahul Gandhi: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు: కేటీఆర్ సెటైర్లు

Published Fri, May 6 2022 9:12 PM | Last Updated on Sat, May 7 2022 9:19 AM

KTR Satirical Tweet On Rahul Gandhi Telangana Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ మరోసారి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. పొలిటికల్‌ టూరిస్ట్‌లు వస్తారు, పోతారు కానీ కేసీఆర్‌ మాత్రమే తెలంగాణలో ఉంటారని తనదైన రీతిలో స్పందించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అయితే ట్వీట్‌కు తగ్గట్టే మేనరిజం ఉన్న ఫోటోను షేర్‌ చేశారు.

jexe ఇప్పటికే రాహుల్‌ పర్యటనను ఉద్ధేశిస్తూ కేటీఆర్‌ వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. స్టడీ టూర్‌కు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ మంత్రి కేటీఆర్ పంచ్‌ వేశారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు రాహుల్‌ తెలుసుకోవాలని, ఇక్కడి పథకాలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement