టీడీపీకి షాక్‌! | Kurnool District TDP Leaders Joins in YSRCP Party | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాక్‌!

Published Sat, Apr 13 2024 8:53 AM | Last Updated on Sat, Apr 13 2024 8:53 AM

Kurnool District TDP Leaders Joins in YSRCP Party - Sakshi

వైఎస్సార్‌సీపీలో జోష్‌ 

కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
 
కండువా కప్పి పారీ్టలోకి ఆహా్వనించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

కోడుమూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో కోట్ల హరిచక్రపాణిరెడ్డికి పట్టు 

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి చేరికతో కోడుమూరులో మరింత బలం 

వైకుంఠం చేరికతో ఆలూరులో టీడీపీకి కోలుకోలేని దెబ్బ 

సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనున్న సమయంలో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పారీ్టకి చెందిన కీలక నేతలు సైకిల్‌ దిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం మల్లిఖార్జున చౌదరితో పాటు మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బళ్లారి డిప్యూటీ మేయర్‌ శశికళతో పాటు పలువురు కీలక నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలతో ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత బలహీనంగా ఉనికి కాపాడుకోవడమే కష్టంగా ఉన్న టీడీపీకి ఈ చేరికలు మూలిగేనక్కపై తాటికాయ పడినట్లయింది. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం రెట్టింపయింది.

సాక్షి ప్రతినిధి,  కర్నూలు:     తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి శుక్రవారం భారీగా చేరికలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఆయన సతీమణి భానుశ్రీ, కుమారులు కిరణ్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాశ్‌రెడ్డి, బళ్లారి డిప్యూటీ మేయర్‌ శశికళ, ఆమె భర్త కృష్ణమోహన్, హాలహర్వి మాజీ జెడ్పీటీసీ చంద్రకళ భర్త రవీంద్ర, మాజీ జెడ్పీటీసీ రేఘుల రమణ, మాజీ ఎంపీపీ సిద్ధప్ప, ఉమాపతి చౌదరి, కురవసంఘం రాష్ట్ర కార్యదర్శి సంఘాల తిమ్మప్ప, బోయ లింగేశ్వర్‌ పారీ్టలో చేరారు.

వీరిని గుంటూరు జిల్లాలో బస్సుయాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరందరికీ సీఎం శుభాకాంక్షలు చెబుతూ పార్టీ విజయానికి కృషి చేయాలని కాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, పార్లమెంట్‌ అభ్యర్థి బీవై రామయ్య, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్‌ సతీశ్, విరూపాక్షి కూడా ఉన్నారు. 

ఆలూరు టీడీపీకి కోలుకోలేని దెబ్బ 
వైకుంఠం మల్లిఖార్జున చౌదరి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పారీ్టలో కొనసాగుతోంది. ఆయన తండ్రి శ్రీరాములు కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా పని చేశారు. న్యాయవాదిగా, సౌమ్యునిగా ఆయనకు పేరుంది. శ్రీరాములు దంపతులను ప్రత్యర్థులు ఒకేరోజు హత్య చేశారు. దీంతో మల్లిఖార్జున చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆలూరులో టీడీపీ ఎదుగుదలకు అన్ని రకాలుగా తోడ్పడ్డారు. అయితే అతనికి కాకుండా ఇటీవల పారీ్టలో చేరిన గుమ్మనూరు జయరాం సిఫార్సు మేరకు వీరభధ్రగౌడ్‌కు టిక్కెట్‌ ఇవ్వడాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. దశాబ్దాలపాటు పారీ్టకి తమ కుటుంబం సేవ చేస్తే ఏమాత్రం గుర్తింపు లేకుండా చంద్రబాబు వ్యవహరించడాన్ని తట్టుకోలేకపోయారు.

అలాంటిపారీ్టలో వద్దు అనుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈయనతో పాటు హాలహరి్వ, హొళగొంద, చిప్పగిరి, ఆలూరు నేతలు కూడా పార్టీలో చేరారు. వీరితో పాటు దళిత వర్గానికి చెందిన మసాల పద్మజ కూడా పార్టీ వీడింది.  వీరభద్రగౌడ్‌కు గుమ్మనూరు జయరాం చేస్తున్న ఆర్థికసాయం మినహా నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు. గుమ్మనూరుకు ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పేకాట, కర్ణాటక లిక్కర్, సెటిల్‌మెంట్లు, అనుచరగణం వ్యవహరించిన తీరుతో అక్కడ ఓటమి తప్పదనే టీడీపీ టిక్కెట్‌ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో వైకుంఠం కుటుంబం టీడీపీని వీడటం ఆపారీ్టకి తీవ్ర నష్టమే! అలాగే శశికళ, కృష్ణమోహన్, కురుబ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంఘాల తిమ్మప్ప చేరికతో కురుబల్లో కూడా వైఎస్సార్‌సీపీకి మరింత బలం పెరిగినట్లయింది. 

‘కోట్ల’ చేరికతో కోడుమూరు, ఆలూరు, పత్తికొండలో పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం 
కోట్ల హరిచక్రపాణిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం శ్రమించి పని చేశారు. కోడుమూరు నియోజకవర్గం నేత అయినప్పటికీ ఆయన ఆలూరు ఇన్‌చార్జ్‌గా పని చేశారు. అయితే 2014 ఎన్నికల్లో పత్తికొండ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కోడుమూరు, ఆలూరు, పత్తికొండ మూడు నియోజకవర్గాల్లో చక్రపాణిరెడ్డికి గట్టి పట్టు ఉంది. మంచి సంబంధాలు ఉన్నాయి.

 సౌమ్యుడిగా పేరున్న ఈయన పార్టీ కేడర్‌లో ఒకరిలా కలిసిపోయి పని చేస్తారు. ‘కోట్ల’ చేరికతో ఈ మూడు చోట్ల మరింత బలం పెరిగినట్లే. ఇప్పటికే కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. ఇప్పుడు హరిచక్రపాణిరెడ్డి చేరారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోసం పని చేసిన బలమైన ఇద్దరు నాయకులు ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. అలాగే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి చేరికతో కర్నూలు రూరల్, బెళగల్‌తో పాటు నియోజకవర్గంలో పార్టీకి పట్టు పెరగనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement