బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే | No defections into BJP without resignation: Bandi Sanjay | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే

Published Mon, Jul 8 2024 6:20 AM | Last Updated on Mon, Jul 8 2024 6:20 AM

No defections into BJP without resignation: Bandi Sanjay

ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు  

మీడియాతో కేంద్ర సహాయమంత్రి సంజయ్‌  

కరీంనగర్‌టౌన్‌: ఇతర పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే.. తప్పనిసరిగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలున్నా, రాజకీయ లబ్ధి కోసం మరింత జటిలం చేసి సమస్యను నాన్చుతూ వచి్చందన్నారు. 

ఇప్పుడు ఆ అవసరం లేదని, రెండు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్‌ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయతి్నస్తున్నారు.  

ఈడీ కేసులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై.. 
ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన నేతలు..కాంగ్రెస్‌లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలన నిజంగా బాగుంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా/తీర్పు కోరాలని, ఒకవేళ ఉపఎన్నికలు జరిగితే కచి్చతంగా అన్ని స్థానాల్లో బీజేపీనే గెలుస్తుందన్నారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై.. 
స్టేట్‌ ప్రెసిడెంట్‌ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని, ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయని చెప్పారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై అన్నీ ఆలోచించి జాతీయనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.  

రామాయణ్‌ సర్క్యూట్, రైల్వేలైన్‌పై.. 
రామాయణ్‌ సర్క్యూట్‌ కింద ఇల్లందకుంట, కొండగట్ట ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశముందని బండి సంజయ్‌ చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్‌ స్కీంలో చేర్చుతామని.. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్‌ మూర్ఖంగా వ్యవహరించారన్నారు. కరీంనగర్‌ –హసన్‌పర్తి రైల్వేలైన్‌ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగిందని, త్వరలోనే దీని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అడిగితే స్మార్ట్‌సిటీ మిషన్‌ గడువు పొడిగించలేదని, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచి్చన విజ్ఞప్తి మేరకే కేంద్రం గడువు పొడిగించిందన్నారు. గడువు పొడిగింపుతో కరీంనగర్‌ కార్పొరేషన్‌కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement