సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కోర్టు మెడికల్ బెయిల్ షరతులను ఉల్లఘింస్తూ పరామర్శ పేరుతో వీరిద్దరూ రాజకీయ చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో పవన్ సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. పైకి పరామర్శ పేరుతో వీరిద్దరూ లోపల రాజకీయాలు చేశారు.
సైకిల్ గుర్తుపైనే ఇద్దరూ పోటీ?
► ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం
► మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన
► పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన
► 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టీడీపీ వర్గాలు
► తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం
► ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన
► ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా?
► చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.!
► ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు
బీజేపీని ఎలా ఒప్పిద్దాం?
► చంద్రబాబు, పవన్ సమావేశంలో ప్రధానంగా బీజేపీపై చర్చ
► సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్
► బీజేపీని ఎలాగైనా ఒప్పించాలని పవన్ కళ్యాణ్‌ను అడిగిన చంద్రబాబు
► బీజేపీ వస్తేనే ఏపీలో తమ పరిస్థితి బెటర్ అవుతుందని స్పష్టీకరణ
► తెలుగుదేశం, జనసేన కలిసినా.. గెలవడం కష్టమన్న అభిప్రాయం
► తెలుగుదేశం బలహీనంగా ఉందని ఇప్పటికే పలు బహిరంగ సభల్లో చెబుతోన్న పవన్ కళ్యాణ్
► నిజమే, తెలుగుదేశం బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు అంటోన్న చంద్రబాబు & కో
► అసలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే సొంతంగానే పోటీ చేసేవారమన్న ఆలోచన
► బీజేపీ తమతో కలిస్తేనే ఏమైనా సీట్లు గెలవగలమన్న అభిప్రాయం
► 2014లో కూడా బీజేపీ కలిసి రావడం వల్ల ప్రయోజనం ఉందని చర్చ
చంద్రబాబుకు మరిన్ని షరతులు..
ఇదిలా ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నిందితుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్.. పోలీసు నోటీసులు జారీ
Comments
Please login to add a commentAdd a comment