కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం బెంగాల్‌లోని ఆరమ్‌బాగ్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.
సందేశ్‌ఖాలీలోని మహిళల బాధల కంటే కొంతమంది ఓట్లు సీఎం మమతకు ముఖ్యమా? అని బెంగాల్ ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై విమర్శలు చేశారు. సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో ఇండియా కూటమి మౌనం వహిస్తుందని మండిపడ్డారు.
బెంగాల్‌లో టీఎంసీ (మాత, భూమి, ప్రజలు) అనే నినాదాన్ని పలుకుతుంది. అలాంటిది సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో టీఎంసీ ఏం చేసింది.? అని మోదీ ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీ ఘటనపై దేశం మొత్తం కోపంగా ఉందని తెలిపారు. ఈ వ్యక్తులు చేసే పనులు చేసి సంఘ సంస్కర్త రాజా రామోహన్‌రాయ్ ఆత్మ శోకిస్తుందని మోదీ మండిపడ్డారు.
ఇక.. సందేశ్‌ఖాలీ మహిళలపై లైంగిక దాడులు, వారి భూములును లాక్కోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్న టీఎంసీ నేత షాజహాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన షాజహన్ ఖాన్‌పై టీఎంసీ.. ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment