సాక్షి, తాడేపల్లి: జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు మరింత మేలు చేకూర్చుతుందని.. విమర్శించే వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం ఆలోచనలకు తగినట్లుగా సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ప్రజల సమస్యలన్నీ పరిష్కారించటంలో సురక్ష కార్యక్రమం ఇంకో ముందడుగు. ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. అలాంటివి కూడా పరిష్కరించాలన్నది సీఎం జగన్ లక్ష్యం’’ అని సజ్జల అన్నారు.
‘‘అర్హులైన వారందరికీ పథకాలు అందాలి. పవన్ కల్యాణ్ ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. వ్యతిరేక ఓటు చీలకూడదని అన్నప్పుడే ఎవర్ని సీఎంని చేయటానికి పవన్ ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కావాల్సిన స్క్రిప్టు ఎల్లోమీడియా నుంచే వస్తుంది. ఒక పథకం ప్రకారం కథ నడుపుతున్నారు. టీవీలో చర్చలు, ఆ తర్వాత గవర్నర్‌ని కలవటం వంటివన్నీ ఆ స్క్రిప్టులో భాగం. ఏపీలో గంజాయి లాంటివి లేకుండా చేసినా కావాలని ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.
గతంతో పోల్చితే ఇప్పుడు అన్యాయం జరిగితే నేరుగా ఫిర్యాదులు చేసే పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఏ అంశాలు లేనందున ఏదో ఒక బురద జల్లేపని చేస్తున్నారు. విశాఖపట్నం ఎంపీ తన వ్యాపారాల గురించి అన్నదొకటి, మీడియా రాసినదొకటి. కులాల మధ్య చిచ్చుపెట్టటం ఎప్పుడైనా భూమ్ రాంగ్ అవుతుంది. చంద్రబాబు మ్యానిఫెస్టోని ఆపార్టీ వారే నమ్మే పరిస్థితి లేదు. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం పోరాడిన వ్యక్తి. దాన్ని అడ్డుపెట్టుకుని ఆయన పవన్ లాగా రాజకీయ లబ్ది ఏమీ పొందలేదు. పవన్ మాత్రమే కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారు’’ అని ఆయన మండిపడ్డారు.
చదవండి: పవన్ కాపులను తిడుతున్నారంటే ఎంత పెద్ద స్కెచ్ వేశారో?: పోసాని
‘‘తెలంగాణ పల్లెలకు వెళ్తే కరెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని కేసీఆర్ అంటున్నారు. ముంబాయిలో ఎకరం అమ్మితే ఇంకా ఎక్కువ కొనవచ్చు. అమెరికాలో అమ్మితే పదివేల ఎకరాలు కొనవచ్చు. ఇవన్నీ ఎలక్షన్లు రాబోతున్నందున కేసీఆర్ మాట్లాడుతున్నారు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment