
సాక్షి, తాడేపల్లి: పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని, ప్రజల ఆశీస్సులతోనే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయమని తెలిపారు. రాబోయే దశాబ్దం పాటు వైఎస్ జగనే సీఎంగా ఉండాలని ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు ఆసహనంలో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఉక్రోశం, ఆక్రోశం ఏంటో ఆర్థం కావడం లేదు ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంకా అహంభావం తగ్గలేదని, ప్రజలను బాబు ఘోరంగా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు.
ఏ రాజకీయనేత అయినా ప్రజల ఆశీస్సులు కావాలని కోరుకుంటారని తెలిపారు. దీనికి విభిన్నంగా చంద్రబాబు ప్రచారంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉండి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారని ఆగహం వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు పోసి గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని చూసినా సాధ్యపడలేదన్నారు. అడ్డదార్లు, వెన్నుపోట్లు ఇవే చంద్రబాబుకు తెలిసిన విద్యని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ప్రజలు విశ్వసించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రచారంలోనూ ప్రజలను ఘోరంగా చంద్రబాబు అవమానిస్తున్నారని, 2019లో ఒక అవకాశం రాగానే చంద్రబాబును పూర్తిగా ఓడించారని గుర్తు చేశారు. 20 నెలల పాలనలో సీఎం వైఎస్ జగన్ ప్రజల నుంచి పూర్తి నమ్మకం తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని ప్రజలు బలంగా నమ్మారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను భారీగా గెలిపించారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా పడిపోయిందని, ఇకపై చంద్రబాబును నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. 95 శాతానికి పైగా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు వచ్చాయని, వచ్చే రెండేళ్లలో మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందుతాయని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment