Telangana Assembly Elections Today Minute To Minute Update
మంత్రి కేటీఆర్‌కు ఈసీఐ నోటీసులు
- టీ వర్క్ ఆఫీస్‌లో విద్యార్థులతో ముఖాముఖి కోడ్ ఉల్లంఘనకు వస్తుందని నోటీస్
- రేపు మధ్యాహ్నం 3గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్న ఈసీఐ
అశోక్‌నగర్‌లో యువతతో రాహుల్ చిట్‌చాట్
- ముషీరాబాద్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం
- ముషీరాబాద్ నియోజక వర్గం అశోక్ నగర్‌లో చౌరస్తాలో విద్యార్థులతో కలిసి చాయ్ తాగుతూ ముచ్చటిస్తున్న రాహుల్
గోషామహల్‌లో కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
- భగ్గుమన్న గ్రూపు రాజకీయ విభేదాలు
- ఉద్యమకారుడు దిలీప్ ఘనాటేపై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు
- పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించిన ఉద్యమకారుడు దిలీప్ ఘనాటే
- నన్నే ప్రశ్నిస్తావా అంటూ దిలీప్ ఘనాటే పై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ రామచందర్ రాజు
- తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిన దిలీప్
రేవంత్ ప్రచారానికి ఏటీసీ అడ్డంకులు
- మోదీ పర్యటనను సాకు చూపుతూ రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌కు అనుమతుల నిరాకరణ
- మూడు గంటలుగా హెలికాప్టర్ అనుమతుల కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూపులు
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు నో అనడంతో తుర్క యాంజల్ రోడ్ షోకు రాలేక పోయిన రేవంత్
- రోడ్ షోలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న
పటాన్‌చెరు ప్రచార సభలో అమిత్ షా
- ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా.. వద్దా?
- 2024లో మోదీ మరోసారి ప్రధాని కావాలా.. వద్దా?
- రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా
- 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుంది
- 2019లో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021లో విగ్రహ ప్రతిష్టాపన చేశాం
- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి
- బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే
- 370 ఆర్టికల్‌ని కాంగ్రెస్ అడ్డుకుంది.. అయినా మోదీ సర్కార్ ఆ ఆర్టికల్‌ని రద్దు చేసింది
- పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్టైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించాం
- కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు
- పటాన్‌చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారు
- నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారు
- నిరుద్యోగులకు భృతి ఏమైంది?
- 2.50 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా పేపర్ లీక్ కాలేదు
- తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయి
- కాంగ్రెస్‌కి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కి వేసినట్లే
- గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు
- ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు పెంచారు కేసీఆర్
- బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు
- సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం
- తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి ఓట్లు అడిగే అర్హత లేదు
- బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది
- బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తాం
- ఎస్టీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
- తొలి క్యాబినెట్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తాం
- రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం
- ప్రజారోగ్యం కోసం రూ. 10 లక్షల బీమా
ములుగులో మావోయిస్టుల లేఖ కలకలం.. బీఆర్‌ఎస్‌కు షాక్!
- భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల
- బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుపై క్లారిటీ
- ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతికి మావోయిస్టు పార్టీ మద్దతు లేదు.
- బీఆర్‌ఎస్‌కు చెందిన లీడర్లు, మాజీ మావోయిస్టులు చేస్తున్న ప్రచారం బూటకం.
- మావోయిస్టు పార్టీ మద్దతు అని పచ్చి అబద్దాన్ని ప్రజలు నమ్మవద్దు
- నాగజ్యోతికి మావోయిస్టు పార్టీ మద్దతు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
- బీఆర్‌ఎస్ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- బీఆర్‌ఎస్ పార్టీ 21వ తేదీన పేపర్లలో ఇచ్చిన ప్రకటనలపై ఫిర్యాదు
- మళ్లీ ఈరోజు పేపర్లలో బీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రకటన వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా ఉందని ఫిర్యాదు
- పోస్టల్ బ్యాలెట్ గందరగోళంపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
- టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ కామెంట్స్..
- బీఆర్‌ఎస్ ఇచ్చే ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి.
- పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను ఆర్వోలు రిజెక్ట్ చేస్తున్నారు.
- పోస్టల్ బ్యాలెట్ ఓటుపై ప్రతీ జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయి.
- బీఎల్వోలు ఓటర్ స్లీప్‌లు పంపిణీ చేయడం లేదు.
- మాజీ IAS అధికారి గోయల్ ఇంటి దగ్గర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు.
- అధికారి ఇంట్లో భారీగా డబ్బు పెట్టారని కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు.
- అధికారి ఇంట్లో సోదాలు, తనిఖీలు న్యాయబద్ధంగా జరగలేదు.
- గోయల్ ఇంట్లో ఏం జరిగిందో స్పష్టత కావాలని సీఈవోను అడిగాము.
- గోయల్ మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో సోదాలు జరిపే అధికారులపై ఒత్తిడి జరిగింది.
- నిన్నటి ఘటనలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
- గోయల్ ఇంట్లో వంటి ఘటనలు రాష్ట్రం అంతటా జరిగే ప్రమాదం ఉంది.
- కొడంగల్‌లో రేవంత్‌పై నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ప్రధాని మోదీ
- మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది
- తెలంగాణలో టెక్నాలజీ సామర్థ్యం కలిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు
- బీఆర్‌ఎస్ అవినీతి వల్ల వారంతా వెలుగులోకి రాలేదు
- కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
- బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లు బయట తిట్టుకుంటాయి.. లోపల కలుస్తాయి
- కాంగ్రెస్-బీఆర్‌ఎస్ బంధం ఈనాటిది కాదు
- బీజేపీ అంటే బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు వణుకు
- కేంద్రంపైఅవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ మద్దతిచ్చింది
- బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది
- ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి
- కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో మంత్రి పదవులు తీసుకున్నారు
- కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే
- తెలంగాణలో జరిగిన అవినీతి చిన్న పిల్లలకు కూడా తెలుసు
- ఇరిగేషన్ స్కీమ్‌లను స్కాములుగా మార్చారు
- దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు
- బీజేపీ గిరిజన మహిలను రాష్ట్రపతిగా చేసింది
- కాంగ్రెస్‌కు కేసీఆర్‌కు ప్రాణమిత్రుడు
- మాదిగ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది
- ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచింది
- కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీస సమయంలో జీతాలు ఇవ్వడం లేదు
- అభివృద్ధి అంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గిట్టదు
- బీఆర్‌ఎస్ తెలంగాణను అవినీతిలో నెంబర్‌వన్ చేసింది
- బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు
- దళితబంధు రావాలంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వాల్సిందే
- కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీస సమయంలో జీతాలు ఇవ్వడం లేదు
- పాలకుర్తి సభలో మంత్రి హరీష్‌రావు
- కాంగ్రెస్ పాలనలో నల్లా నీళ్లు రాలేదు
- కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్‌పై పాటలొచ్చాయి
- కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతాం
- కాంగ్రెస్ చెబుతున్న మార్పు ఏంటి?
- పాలకుర్తి ప్రజలు నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వారు కాదు
- పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరు
- నోట్ల కట్టలున్నాయన్నది వారి అహంకారం
- కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో 50 ఏళ్లు చూశాం
- 50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
వేములవాడ బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి
- బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణా ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు
- అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణాను దోపిడీ చేసేశారు
- బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం
- నీళ్లు, నిధులు, నియామాకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణాలో ఆ కలలు ఇంకా నెరవేరలేదు
- సర్ ప్లస్ ఆదాయంతో ఉన్న తెలంగాణాను అప్పులకుప్పగా మార్చేశారు
- ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణా పరిస్థితే గతంలో ఉండేది
- కానీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది
- ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా ఉన్నాం
- తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే
- డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది
- ప్రపంచంలో భారతదేశం గొప్పదనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్ ను దృఢంగా నిల్పిన ఘనత మోదీజీది
- ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది
- సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు
- వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ ను గెలిపించి మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను
కామారెడ్డిలో ప్రధాని మోదీ కామెంట్స్
- బీఆర్‌ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి
- 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు
- బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది
- గిరిజన యూనివర్సిటీ హామీ నిలబెట్టుకున్నాం
- తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- మహిళా రిజర్వేషన్లు, అయోధ్య రామమందిరం
- వన్ ర్యాంక్ వన్ పెన్షన్ హామీలను అమలు చేశాం
- సకల జనుల సౌభాగ్య తెలంగాణే లక్ష్యం
- మేము హామీ ఇస్తే నెరవేర్చి తీరుతం
- నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం
- బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించాం
- బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుంది
- ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం
- తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది
- ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేశాం
- ప్రాజెక్టుల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారింది
- తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదు
తెలంగాణ మంత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకున్నారు: రేవంత్
- మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు.
- నల్లరైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దుకు బీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చారు.
- ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సాయం చేస్తారు.
- తెలంగాణలో కేసీఆర్ సీఎం కావాలని మోదీ కోరుకుంటున్నారు.
- మోదీ తీరు మారనంత వరకు రాహుల్ పోరాతుడూనే ఉంటారు.
- మాపై అనేక కేసులు పెట్టారు.
- నా ఇల్లు లాక్కున్నారు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు.
- కేసీఆర్ ఇల్లు లాక్కున్నారా?. కేసీఆర్‌పై కేసులు పెట్టారా?
- మోదీ కేసీఆర్ ఒకటే కాబట్టి కేసులు పెట్టలేదు.
- కారు నాలుగు టైర్లలో గాలిని తీసేశాం.
- ఇక్కడ బీఆర్‌ఎస్.. కేంద్రంలో బీజేపీని ఓడిస్తాం.
- ఆదిలాబాద్‌లో రాహుల్ ఎన్నికల సభ.
- ఇసుకలో దోపిడీ, మైనింగ్‌లో దోపిడీ.
- ఎవరి భూములు వారికిచ్చేదే ప్రజా తెలంగాణ.
- ధరణి తెలంగాణలో కేసీఆర్ మీ భూములు లాక్కున్నారు.
- ఎటునుంచి చూసినా కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు.
- 8 వేల మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహతోయ చేసుకున్నారు.
- ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లీంచి దళితుల అభివృద్ధికి గండి కొట్టారు.
- ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు.
- మీ స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులునాశనం చేశారు.
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లోనే గ్యారంటీలను చట్టాలుగా మారుస్తాం.
- ప్రజల తెలంగాణలో మొదటగా తీసుకురాబోయేది మహాలక్ష్మి స్కీం.
- ప్రజల తెలంగాణలో గ్యాస్ సిలీండర్‌ను రూ.500కే ఇస్తాం.
- రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం.
- ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం.
- రైతులు ఆ‍్మహత్యలను ఆపాలని అనుకుంటున్నాం
- ఇళ్లు కట్టుకోవలనుకుంటున్న పేదలకు రూ. 5 లక్షలు ఇస్తాం.
- మీ చేతుల్లో గ్యారంటీ కార్డు పెట్టాం.
కేసీఆర్ అందులో ఎక్స్‌పర్ట్: కాంగ్రెస్ నేత డీకేఎస్
- హైదరాబాద్‌లో మీడియాతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలు
- కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుండి నడుస్తుంది. తెలంగాణలో పాలన ఫామ్ హౌజ్ నుండి నడుస్తుంది
- ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్
- గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనదంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు..
- వేరే పార్టీలు ఎమోషన్స్ తో పాలిటిక్స్ చేస్తాయి.
- కాంగ్రెస్ ప్రజల జీవితాలను దృష్ఠిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తాయి..
- తెలంగాణ విషయంలో కర్ణాటక హృదయంతో ఆలోచిస్తోంది
- ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్
- చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడ్డారు
- రూరల్‌లో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు
- ఫైవ్ స్టేట్స్ ఎన్నికల ఫలితాలపై విదేశాల్లోనూ ఆసక్తి
- జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
లేనిపోని పుకార్లు రేపుతున్నారు: కేటీఆర్
- 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులెన్నో చేశాం
- లేనిపోని పుకార్లు రేపుతున్నారు
- అసైన్డ్‌భూములు ఉన్నవారికి పూర్తిగా అధికారం ఇస్తాం
- చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్
- మనందరి కోసం 14 ఏండ్లు ఢిల్లీ రాక్షసులతో కేసీఆర్ పోరాడిండు
- ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తాం
- కాంగ్రెస్ మార్పు అంటే ఆరునెలలకొక సీఎం
బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి
- సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం
- సంపన్న రాష్ట్రం తెలంగాణలో అప్పుల కుప్పగా మారింది
- నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పూర్తిగా పక్కనపెట్టారు
- బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి
- యువతను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది
- తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలే
- మహబూబాబాద్‌లో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం
- కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలే
- ప్రజలు మళ్లీ అలాంటి రిస్క్ తీసుకోవద్దు
- రైతు బంధు ఇస్తే సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది
- రేవంత్‌కు బూతులు తప్ప భవిష్యత్తు తెలియదు
- కేసీఆర్ పాలనలో విద్య, వైద్యం, కరెంట్ వచ్చాయి
కాంగగ్రెస్ వస్తే మళ్లీ మనం ఆగం కామా?
చౌటుప్పల్ మండలం దామెర వద్ద టెన్షన్ వాతావరణం
- దామెర బీజేపీ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ప్రచార రథం.
- డీజేలతో కాంగ్రెస్ పాటలు.
- ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు.
- కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే రెచ్చగొడుతున్నారని బీజేపీ కార్యకర్తల నిరసన.
- ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి చలమళ్ళ కృష్ణారెడ్డి.
- పోలీసుల రంగ ప్రవేశం.
- కాంగ్రెస్ ప్రచార రథాన్ని బీజేపీ కార్యాలయం వద్ద నుంచి పంపించిన పోలీసులు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది: ప్రియాంక గాంధీ
- పాలేరులో కాంగ్రెస్‌రోడ్ షో.. ప్రియాంక ప్రసంగం
- తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని సాధించారు.
- పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సాధించింది.
- రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది.
- మార్పు రావాలి.. తెలంగాణ రావాలి.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.
- పాలేరు రోడ్‌షోలో ప్రచార వాహనంపై హుషారుగా చిందులేసిన ప్రియాంక గాంధీ
కరీంనగర్‌లో ఓటర్ల ఆగ్రహం
- కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బారులు తీరిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
- ఓటు వినియోగించుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఓటర్ల మండి పాటు
- తమ విధులు మానుకుని ఓటు వేయడానికి వస్తే ఆర్డీఓ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
హరీష్‌రావు హెలికాఫ్టర్ రాంగ్ ల్యాండింగ్
- బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో సమాచార లోపం
- గందరగోళం నడుమ.. హరీష్‌రావు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మరోచోట ల్యాండింగ్
- మహబూబాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన హెలికాఫ్టర్ గూడూరులో ల్యాండింగ్
- మహబూబాబాద్‌కు రోడ్డు మార్గంలో బయల్దేరిన హరీష్‌రావు
అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
- కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్‌లో అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ అటాక్
- అమిత్ షా కాదు.. అబద్దాల షా..
- ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపిస్తాం అని చెప్పుతున్నారు.
- బీజేపి వాళ్లు ఎయిర్ ఇండియా మూసివేశారు, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశారు.
- ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ముంచిందే బీజేపి నాయకుడు గోకరాజు గంగరాజు.
- ప్రభుత్వానికి చెప్పకుండా లేఅవుట్ చేసి కోర్టులో పంచాయతీ పెట్టాడు.
- షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు తెరిపిస్తామని చెప్పడం విడ్డూరం.
తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్‌ఎస్, బీజేపీతో కలుస్తుంది: ఏచూరి సీతారామ్
- ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదు.
- యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు.
- హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉంటుంది.
మోదీ, కేసీఆర్ మధ్య ఫెవీకాల్ బంధం మరోసారి బయటపడింది: రేవంత్
- ఏకే గోయల్ ఇంట్లో ఉన్న మూడు వందల కోట్ల రూపాయలు పోలీసులే బయటకు పంపించారు.
- ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని గత ఎన్నికల సమయంలో చర్చ జరిగింది.
- ఈ సారి అలా జరగకుండా నవంబర్ 15 లోపే రైతు బంధు వేయాలని మేము ఎన్నికల కమీషన్‌ను కోరాం.
- కానీ ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
- కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించేలా నిర్ణయం తీసుకున్నారు.
- బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న పెవికాల్ బంధం స్పష్టంగా కనిపిస్తుంది.
- ఎన్నికల ముందు రైతు బంధు వేయడం వల్ల.. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చే 15 వేల రూపాయలలో 5 వేల నష్టం జరుగుతుంది.
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు నష్టపోయిన 5 వేల రూపాయలు ఇస్తాం.
- కౌలు రైతులకు ఇప్పుడు నష్టపోతున్నారు.వారికి కూడా ఇస్తాం
అవీనితి తప్ప.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు: అమిత్ షా
- 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
- పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.
- మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను దివాళ తీసింది.
- సెప్టెంబర్17 నిర్వహణపై ఇచ్చిన మాట తప్పింది.
- కేజీ టూ పీజీ విద్యను గాలికొదిలేశారు.
- ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
- లక్ష రుణమాఫీ చేయలేదు.
- ప్రతీజిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల హామీ అమలు కాలేదు
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే.
- కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ.
- యువత, పేదలు,రైతులు అందరూ నిరాశలో ఉన్నారు.
- స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.
- అవినీతి తప్ప బీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేం లేదు.
- తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
- ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మేం రద్దు చేస్తాం.
- ఇచ్చిన హామీలన్నీ ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ తీర్చింది.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక, పెట్రోల్, డీజీల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.
- మీ ఓటు భారతదేశ భవిష్యత్తును మార్చేస్తుంది.
- తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.
బీఆర్ఎస్ అఖండ విజయం ఖాయం: రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులతో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి,ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆత్మీయ సమావేశం
- అందరి ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజలకు సేవ చేస్తున్న సండ్ర వెంకటవీరయ్య అంటే నాకెంతో అభిమానం.
- 10 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేనంత సత్తుపల్లి ప్రాంతం అభివృద్ధి చెందింది.
- 1000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి సత్తుపల్లి ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేశారు.
- పనిచేసే వ్యక్తికి పట్టం కట్టాలి. 15 ఏళ్లుగా అభివృద్ధికి తోడ్పడుతున్న నాయకులను ఎన్నుకోవాలి.
- ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను, బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలి.
నేడు బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటన
- నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభ
- మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం.
- కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు..
- బోధన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి.
- గత పార్లనెంట్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు.
- బీఆర్ఆస్‌లో తగిన గౌరవం దక్కలేదని పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన మండవ.
- ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి మండవ
- నిజామాబాద్ జిల్లాలో సెటిలర్ల ఓట్లపై మండవ ప్రభావం.
- సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం.
- నిజామాబాద్ రూరల్, ఆర్ముర్, బోధన్, బాన్సువాడలో సెటిలర్ల జనాభా ఎక్కువ.
- సెటిలర్లకు పెద్ద దిక్కుగా మండవ వ్యవహరిస్తారన్న పేరుంది.
- జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన.
- ఉదయం నుంచి సాయంత్రం వరకు కోరుట్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రచారం చేయనున్న కవిత.
- సాయంత్రం మెట్‌పల్లి పట్టణంలోని వివిధ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి ప్రచారంలో పాల్గొననున్న కవిత.
- కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ అరవింద్‌కు మద్దతుగా ఈ రోజు నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ పర్యటన.
- ఇబ్రహీంపట్నం ప్రచారంలో అరవింద్‌తో పాటు పాల్గొననున్న మందకృష్ణ.
- కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలతో పాటు.. సాయంత్రం కరీంనగర్ నగరంలో ప్రచారం చేయనున్న బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్.
ఖమ్మంలో ప్రియాంక రోడ్ షో.
- ఉదయం 9:30 గంటలకు ప్రియాంక గాంధీ సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జడ్పీ సెంటర్, వైరా రోడ్, పాత బస్టాండ్, సెంటర్, మీదుగా కాల్వ ఒడ్డు, వరకు రోడ్ షో కొనసాగనుంది.
- మధిరలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ.
- మధ్యాహ్నం 2:40 గంటలకు మధిరలో కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీతో పాటు హాజరుకానున్న పలువురు అగ్రనేతలు.
నేడు కామారెడ్డికి ప్రధానిమోదీ
- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సాయంత్రం 42గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం
- ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు.
- సభకు లక్ష మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నేతలు.
బీజేపీ టాప్–5 నేతలంతా నేడు రాష్ట్రంలోనే..
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శనివారం ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది.
- బీజేపీలోని ఐదుగురు అగ్రశ్రేణి నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
- ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ తమ రాకతో పార్టీ కేడర్‌లో జోష్ నింపనున్నారు.
- ప్రధాని మోదీ శని, ఆది, సోమవారాల్లో వరుస సభలు, రోడ్ షోలలో పాల్గొంటుండగా, అమిత్ షా శుక్ర, శని, ఆదివారాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
- సిర్పూర్, వేములవాడలలో బహిరంగ సభలు, సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొంటున్నారు.
- పార్టీ ఎన్నికల కమిటీల పనితీరును బీఎల్ సంతోష్ శనివారం సమీక్షించనున్నారు. అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజావ్యతిరేకత ఉందన్న సొంత సర్వేల అంచనాల నేపథ్యంలో బీజేపీ శక్తియుక్తులను తెలంగాణపై కేంద్రీకరిస్తోందని.. అందులో భాగంగానే అగ్రనాయకత్వం ముమ్మర ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
నేడు యూపీ సీఎం యోగి విస్తృత ప్రచారం
- ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం రాష్ట్రంలో విస్తృత ప్రచారం.
- ఉదయం 11 గంటలకు సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు వేములవాడ అసెంబ్లీలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.
- మధ్యాహ్నం 2.30 గంటలకు సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.
- సాయంత్రం 4 గంటలకు గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ఆకాశ్‌పురి హనుమాన్ మందిరం నుంచి రోడ్‌షో ప్రారంభించి అనిత టవర్, పురానాపూల్ గాంధీ స్టాచ్యూ, గోల్కొండ (గోషామహల్ జిల్లా)లలో కార్నర్ మీటింగ్‌లలో యోగి ప్రసంగిస్తారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల వివరాలివ్వండి
- రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
- రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అందజేయాలి.
తదుపరి విచారణలోగా కేసుల వారీగా వివరాలు సమర్పించాలి. - విచారణను డిసెంబర్ 15కు వాయిదా
- అశ్వినీకుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నవంబర్ 9న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విచారణలను హైకోర్టు వేగవంతం.
- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం సుమోటో పిల్‌గా విచారణ.
- క్రిమినల్ కేసుల డేటాను రెండు వారాల్లోగా క్రోడీకరించి హైకోర్టుకు అందజేయాలని రిజిస్ట్రీకి ఆదేశం.
కాంగ్రెస్ రావడం ఖాయం: సీడబ్ల్యూసీ సభ్యురాలు సుప్రియా శ్రీనటే
- తె లంగాణ ప్రజలకు అధికారంలో సమానత్వం లభిస్తుందని సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు.
- కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో సగటు మనిషి జీవితం దుర్భరమైపోయింది.
- రాష్ట్రంలో ఏ వర్గం అభివృద్ధి చెందకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది.
- కేసీఆర్ ఇంట్లోనే సీఎం, మంత్రి పదవులు తెచ్చుకున్నారని, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు.
- ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదు.
- తెలంగాణలోని ప్రతి వర్గం మార్పు కోరుకుంటోంది.
- ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి రావడం ఖాయం.
- తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.
నేటి నుంచి సీతారాం ఏచూరి, బృందా కారత్ ఎన్నికల ప్రచారం
- సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం నుంచి ఈనెల 28 వరకు వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
- సీతారాం ఏచూరి ఈ నెల 25న సాయంత్రం పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని, 26న మధ్యాహ్నం భువనగిరి సభలో ప్రసంగిస్తారు.
- 27న మిర్యాలగూడ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు.
- బృందా కారత్ ఈనెల 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సభలో పాల్గొంటారు
- ,27న భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్లలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.
- 28న కోదాడ, హుజూర్‌నగర్‌లలో రోడ్ షో నిర్వహిస్తారు.
సోనియా దీవిస్తేసీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం థానేదారుపల్లి, కంకణాలపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
- సోనియాగాంధీ ఆశీర్వదిస్తే ఏదో ఒకరోజు సీఎం అవుతా.
- కేసీఆర్ పాలన లో తెలంగాణ ఆగమైంది.
- రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు.
- 15 రోజుల్లో కేసీఆర్‌ను ప్రగతి భవ న్ నుంచి బయటకు పంపే పరిస్థితి రాబోతుంది.
- ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
- ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో పడేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
నేటిలోగా ఆర్వోలకు ఫారం 12డీలను పంపాలి
- జిల్లా కలెక్టర్లకు సీఈఓ ఆదేశం
- ఫారం 12డీలను పరిశీలించిన అనంతరం సదరు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలి
- ఆర్వోలకు ఈ దరఖాస్తుల చేరవేతను శనివారంలోగా పూర్తి చేయాలి
- దరఖాస్తును సంబంధిత నియోజకవర్గ ఆర్వో పంపడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
పరేడ్‌గ్రౌండ్‌లో నేటి బీఆర్‌ఎస్ సభ రద్దు
- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నేడు నిర్వహించ తలపెట్టిన ప్రజాఆశీర్వాద సభ రద్దు
- హైదరాబాద్-సికింద్రాబాద్‌లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు
- ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారసభలు
తెలంగాణలో కాంగ్రెస్ గాలి: ప్రియాంకా గాంధీ
- కాంగ్రెస్ గెలుపుతోనే తెలంగాణ యువత కల సాకారం
- బీఆర్‌ఎస్, బీజేపీ.. బొమ్మా బొరుసు ఆ పార్టీలకు ఎంఐఎం అంటకాగుతోంది
- యువత జీవితాలను కేసీఆర్ చీకట్లోకి నెట్టారు.. రైతులు, మహిళలకు ఏం చేశారని ఓట్లు అడుతున్నారు?
- మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రచారం
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్‌కౌంటర్లు
- తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే
- ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
- కాంగ్రెస్ వస్తే కర్ణాటక తరహాలో ఇక్కడా దగానే
- ‘అభివృద్ధి’ పాలన కావాలా? దళారీల పాలన కావాలా?
- బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే..
- సింగరేణి కొంగు బంగారం.. దీన్ని మరింత విస్తరిస్తాం
- పార్టీల చరిత్ర, పాలన బేరీజు వేసుకుని ఓటేయాలని విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment