సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు బాహాటంగానే టీపీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇన్ని రోజులు కాంగ్రెస్‌కు అడ్డగా ఉన్న మునుగోడులో మరోసారి హస్తం జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు ప్రణాళికలు రచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకన్నారు. రేపు(శనివారం) రేవంత్ రెడ్డి మునుగోడుకు వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మునుగోడులో కాంగ్రెస్ జెండా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన మునుగోడు- మన కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 7 మండలాలు, 176 గ్రామాల్లో కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టనుంది. అలాగే, మన మునుగోడు- మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు పంపిణీ చేయనున్నారు.
మరోవైపు.. బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ సైతం మునుగోడుపై ఫోకస్‌ను పెంచాయి. కాగా, మునుగోడు కాషాయ జెండా ఎగురువేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈనెల 21న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్‌ఎస్ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
మన మునుగోడు… మన కాంగ్రెస్…#ManaMunugodeManaCongress pic.twitter.com/qrfflErQrG
— Revanth Reddy (@revanth_anumula) August 19, 2022
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట.. రేవంత్‌కు కొత్త టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment